Nirupam Paritala: ఘనంగా నిరుపమ్ గృహప్రవేశ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల (Nirupam Paritala) అందరికీ సుపరిచితమే. ‘కార్తీక దీపం’ సీరియల్ తో బోలెడంత మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ఈ నటుడు. దివంగత నటుడు, రచయిత అయినటువంటి ఓంకార్ గారి అబ్బాయే ఈ నిరుపమ్ అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.గతంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అతను బుల్లితెర పై ‘ఇది కథ కాదు’ ‘పవిత్ర బంధం’ వంటి సీరియల్స్ తో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు.

అయితే తర్వాత ఆయన ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అటు తర్వాత ఆయన మరణించడం కూడా జరిగింది. తండ్రి చనిపోయినప్పటికీ నిరుపమ్ ఎంతో కష్టపడి పని చేశారు. కుటుంబానికి అండగా నిలబడి ఈరోజు బుల్లితెర స్టార్ గా ఎదిగారు. ఇక ‘చంద్రముఖి’ సీరియల్లో తనతో పాటు కలిసి నటించిన మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిరుపమ్. వీళ్ళిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ శ్రీరామనవమి రోజున తన ఫాలోవర్స్ తో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు నిరుపమ్.

అదేంటి అంటే.. ఇప్పటివరకు నిరుపమ్ అండ్ ఫ్యామిలీ అద్దె ఇంట్లోనే నివసిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి.. సొంతింటి కల నెరవేర్చుకున్నారట. ఈ విషయాన్ని నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నిరుపమ్ ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్.. నిరుపమ్ అండ్ ఫ్యామిలీకి ‘కంగ్రాట్యులేషన్స్’ చెబుతున్నారు. ఇక ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus