Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘మాచర్లనియోజకవర్గం’ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ : నితిన్

‘మాచర్లనియోజకవర్గం’ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ : నితిన్

  • August 8, 2022 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మాచర్లనియోజకవర్గం’ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ : నితిన్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ పై భారీ అంచనాలు వున్నాయి. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌ బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచాయి. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తం గా విడుదలౌతున్న ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. దర్శకులు హను రాఘవపూడి, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ ప్రీరిలీజ్ వేడుకకు అతిధులుగా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన అతిధులకు, అభిమానులకు కృతజ్ఞతలు. అందరికీ హ్యాపీ ఫ్రండ్షిప్ డే. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. ఈ ప్రయాణంలో ప్రేక్షకులు, ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే మీ ముందు ఇలా వుండేవాడిని కాదు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నా. ‘మాచర్ల నియోజకవర్గం’ నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న సినిమా. ఇందులో నటించిన సముద్రఖని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మజీ, వెన్నల కిషోర్.. అందరికీ కృతజ్ఞతలు. సముద్రఖని గారు మాకు ఎంతో సహకరించారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నా. ఆయన దర్సకత్వంలో నటించాలని కూడా కోరుకుంటున్నాను. ఇందులో వెన్నెల కిషోర్ కామెడీ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ గా వుంటుంది. మా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బావుంటాయి. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మా ఆస్థాన టెక్నిషియన్ అయిపోయారు. తిరు డైలాగ్స్ చాలా బాగా రాశాడు. ఈ సినిమా కథ కి హెల్ప్ చేసిన వక్కంతం చైతుకి కూడా చాలా థాంక్స్. తన సపోర్ట్ చాలా ఎనర్జీని ఇచ్చింది. పాటలు రాసిన శ్యామ్, చైతు, కేకే నా కెరీర్ లో ప్రధాన భాగంగా వున్నారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు రాశారు. ముందుముందు కూడా మంచి పాటలు రాయాలి. మహతి స్వర సాగర్ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యింది. ఆర్ఆర్ చేయడంలో మణిశర్మ గారు కింగ్ అంటారు. కానీ ఈ సినిమాలో సాగర్ తండ్రిని మించిన తనయుడనిపిస్తాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగొట్టాడు. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కాదు గూస్ పింపుల్సే. ప్రసాద్ మురెళ్ళ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో వున్న ఫైట్స్ నా కెరీర్ లోనే ది బెస్ట్ ఫైట్స్. అనల్ అరుసు, వెంకట్, రవి వర్మ, విజయ్ మాస్టర్స్ ఇరగదీశారు. ప్రతి ఫైట్ హైలెట్. డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ, జిత్తుకి థాంక్స్. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్. కేథరిన్ తో పని చేయడం ఆనందంగా అనిపించింది. కృతి శెట్టి చూడటానికి అమాయకంగా సాఫ్ట్ గా వుంటుంది. కానీ కృతిలో చాలా పరిణితి వుంది. షూటింగ్ సమయంలో తను అడిగే సందేహాలు చాలా స్మార్ట్ గా వుంటాయి. చాలా తక్కువ మంది హీరోయిన్స్ లో ఈ క్యాలిటీ చూశాను. ఆమె చాలా దూరం ప్రయనించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు శేఖర్ నాకు ఎప్పటినుండో నాకు ఫ్రండ్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇది తన మొదటి సినిమాలా వుండదు. చాలా అనుభవం వున్న దర్శకుడిలా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమాతో శేఖర్ మంచి కమర్షియల్ దర్శకుడౌతాడు. నిర్మాతలైన మా నాన్న, అక్కకి థాంక్స్. సినిమాని చాలా బాగా తీశాము. సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాం. ఆగస్ట్ 12న గట్టిగా కొట్టబోతున్నాం. ఆగస్ట్ 12 న థియేటర్ లో కలుద్దాం. మీ అందరి ప్రేమ కావాలి” అని కోరారు.

కృతి శెట్టి మాట్లాడుతూ.. నితిన్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ‘మాచర్ల నియోజకవర్గం’ లో నితిన్ గారి నుండి ప్రేక్షకులు క్లాస్, మాస్ ఎంటర్ టైమెంట్ ఆశించవచ్చు. నితిన్ గారి లాంటి ఫ్రండ్ వుండటం అదృష్టంగా భావిస్తున్నా. ‘మాచర్ల నియోజకవర్గం’ లాంటి మాస్ కమర్షియల్ సినిమాలో స్వాతి లాంటి నేటివ్ టచ్ వున్న పాత్రని ఇచ్చిన దర్శకుడు శేఖర్ గారికి కృతజ్ఞతలు. ఆయనతో మరోసారి వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీ నటులందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు.సుధాకర్ గారు, నిఖితా గారి నిర్మాణంలో పని చేయడం చాలా ఆనందంగా వుంది. హరి, రాజ్ కుమార్ గారికి థాంక్స్. మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో పని చేసిన అన్ని విభాగాలకు కృతజ్ఞతలు” తెలిపారు.

చిత్ర దర్శకుడు ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్రండ్షిప్ డే రోజు ఈ వేడుక జరగడం చాలా హ్యాపీగా వుంది. నన్ను ఎడిటర్ నుండి డైరెక్టర్ ని చేసిన నితిన్ గారికి పెద్ద థాంక్స్. లై సినిమా జరుగుతున్నపుడు కథ వుంటే చెప్పు సినిమా చేద్దామని చెప్పారు నితిన్. గత ఏడాది సంక్రాంతికి వెళ్లి కథ చెప్పాను. కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. మాట నిలబెట్టుకునే మనసున్న వాడు మా నితిన్. గత వారం వచ్చిన రెండు సినిమాలు ఎలా విజయం సాధింఛాయో మా సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. సాలిడ్ హిట్ కోడతామనే కాన్ఫిడెన్స్ వుంది. ఏడాది పాటు పని లేకుండా వున్నప్పుడు సుధాకర్ గారు దేవుడిలా పిలిచి వరుసగా సినిమాలు ఇచ్చారు. ఆ దేవుడి ఋణం ఆగస్ట్ 12 తీర్చుకోబోతున్నాను. నిఖితా అక్క ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. ఈ సినిమాతో అందరం హ్యాపీ గా ఉండబోతున్నామని మనస్పూర్తిగా నమ్ముతున్నాం. నా రైటింగ్ టీం ఆర్ కే, వినోద్, చైతన్య వక్కంతం కి థాంక్స్ డైలాగ్ రైటర్ మామిడాల తిరుపతి బుల్లెట్లు దించాడు. మీ అందరికీ నచ్చుతాయి. ఆర్ట్ డైరెక్టర్ సురేష్, ఎడిటర్ చంటి, కెమరామెన్ ప్రసాద్ మూరెళ్ళ, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ కి థాంక్స్. కృతి శెట్టి అద్భుతంగా నటించారు. అలాగే కేథరిన్ కూడా చక్కగా నటిచింది. మిగతా యూనిట్ మొత్తానికి పేరుపేరున కృతజ్ఞతలు. ఈవెంట్ కి వచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసినఅతిధులకు అభిమానులకు కృతజ్ఞతలు ”తెలిపారు

దర్శకుడు హను రాఘపుడి మాట్లాడుతూ.. ఆగస్ట్ నెల నితిన్, నాకు బాకీ పడివుంది. మా కాంబినేషన్ లో వచ్చిన లై ఆగస్ట్ విడుదలైయింది. అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నాకు సీతారామంతో ఆగస్ట్ బాకీ తీర్చుకుంది. నితిన్ కు కూడా ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బాకీ తీర్చుకుంటుంది. నితిన్- దర్శకుడు శేఖర్ ‘మాచర్ల నియోజకవర్గం’తో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. నితిన్, శేఖర్ లో దర్శకుడిని గుర్తించి ప్రోత్సహించారు. శేఖర్ యాబై సినిమాలకి ఎడిటర్ గా పని చేసిన అనుభవంతో ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. మహతి స్వరసాగర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. . ‘మాచర్ల నియోజకవర్గం’లో ఒక ఫైట్ చూశాను. నితిన్ ని అంత మాస్ గా చూడటం ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా చేశాడు. . ‘మాచర్ల నియోజకవర్గం’ పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నిఖితా, సుధాకర్ రెడ్డి గారికి వాళ్ళ బ్యానర్ లో హిట్ రాబోతుంది. నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి. దిల్ సినిమా తర్వాత ఆయన్ని కలసి భయంభయంగా ఒక కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత నాలో వున్న భయం అంతా పోయింది. నాకు అంత ప్రోత్సాహం, ధైర్యం ఇచ్చారు. నేను అదే ధైర్యంతో అతనొక్కడే సినిమా చేశాను. భవిష్యత్ లో నితిన్ తో ఖచ్చితంగా సినిమా చేస్తాను” అన్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. శేఖర్ లో ప్రతిభని గుర్తించి దర్శకుడిని చేశారు నితిన్. వారి ఇద్దరి కలయికలో ‘మాచర్ల నియోజకవర్గం’లాంటి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా పాటలు నాకు బాగా నచ్చాయి. కృతి శెట్టి చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. సుధాకర్ రెడ్డి గారు మాస్ పల్స్ తెలిసిన నిర్మాత. ఇటివలే విక్రమ్ సినిమాని విడుదల చేసిన హిట్ కొట్టారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఆగస్ట్ 12 న వస్తున్న . ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి” అని కోరుకున్నారు.

దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ.. నితిన్ గ్రేట్ యాక్టర్. ‘మాచర్ల నియోజకవర్గం’కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దర్శకుడు నేను రాసిన టెంపర్ సినిమాకి ఎడిటర్. ఆయన ఎడిటింగ్ తో చాలా సినిమాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ‘మాచర్ల నియోజకవర్గం’ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఇందులో రెండు యాక్షన్ సీక్వెన్స్ లని చూశాను. షాకింగా వున్నాయి. ప్రేక్షకులు కోరుకునే వినోదం ఇవ్వడానికి నితిన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆగస్ట్ 12 న హిట్ కొట్టి అదే జోరుతో నా సెట్స్ కి రావాలని కోరుకుంటున్నాను. ‘మాచర్ల నియోజకవర్గం’ టీం అంతటికి అల్ ది బెస్ట్” తెలిపారు.

దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ,.. ‘మాచర్ల నియోజకవర్గం’ టీం చాలా పాజిటివ్ గా వుంటారు. ఇంతకుముందు మ్యాస్ట్రో సినిమా చేశాను. నితిన్ గారు చాలా బావున్నారు. శేఖర్ మంచి ఎడిటర్. ఈ సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టాలి. ఆగస్ట్ 12 ‘మాచర్ల నియోజకవర్గం’ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజికవర్గాల్లో బాగా ఆడాలి’ అని కోరారు.

సముద్రఖని మాట్లాడుతూ.. నితిన్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. కానీ ఆయనే ఇరవై ఏళ్ల కుర్రాడిలా వున్నారు. ఆయన మనసు, మానవత్వం, నిజాయితీ వలన మరో ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇలానే వుంటారు. దర్శకుడు శేఖర్ అద్భుతమైన కథ చెప్పారు. వాళ్ళ చుట్టు పక్కల వున్న ఊర్లో ఇలాంటి పరిస్థితుల వున్నాయని వివరించారు. చిత్ర యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

బ్రహ్మాజీ మాట్లాడుతూ..’మాచర్ల నియోజకవర్గం’ లో కొత్త నితిన్ ని చూస్తారు. అద్భుతంగా చేశారు. మా కాంబినేషన్ లో అన్నీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మాచర్ల నియోజకవర్గం కూడా వంద శాతం బ్లాక్ బస్టర్ అవుతుంది” అన్నారు.

కృష్ణ కాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా లో అందిరిందే, పోరి సూపర్ అనే రెండు పాటలు రాశాను. ఈ రెండు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా దర్శకుడు శేఖర్ నా మిత్రుడని చెప్పడానికి చాలా గర్వంగా వుంది. నితిన్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని, పెద్ద హిట్ కోడతాడని భావిస్తున్నాను. గత వారం విడుదలైన రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధిస్తుందని, పఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీస్ అంతా థియేటర్ కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ఇందులో రారా రెడ్డి పాట రాశాను. ఇందులో రానురాను అనే పాట వాడుకోవడం చాలా ఉపయోగపడింది. ఆ పాట రచయిత కులశేఖర్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈపాటని అద్భుతంగా కంపోజ్ చేసిన మహతి స్వర సాగర్ కి థాంక్స్. అలాగే దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు. నితిన్ గారి కెరీర్ లో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. నితిన్ గారికి ఇష్క్ నుండి పాటలు రాస్తున్నా. శ్రేష్ట్ మూవీస్ నాకు హోమ్ బ్యానర్ లాంటింది. 2014నుండి మాస్ సినిమా చేయమని ఆయన్ని హింస పెడుతున్నా. ‘మాచర్ల నియోజకవర్గం’తో అది కుదిరింది. దర్సకత్వం చేస్తూ ఎడిట్ చేయడం అంత తేలిక కాదు. ఈ సినిమా కోసం శేఖర్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు

ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ .. నితిన్ అన్నతో ఇది నాకు మూడో చిత్రం. భీష్మా, మాస్ట్రో.. ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’ తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. నిర్మాతలు సుధాకర్, నిఖితా, దర్శకుడు శేఖర్ గారికి కృతజ్ఞతలు.

విజయ్ మాస్టర్ మాట్లాడుతూ .. నితిన్ గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అన్నీ ఎలిమెంట్స్ ‘మాచర్ల నియోజకవర్గం’లో వున్నాయి. ఆగస్ట్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nithiin
  • #Macharla Niyojakavargam

Also Read

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Bad Boy Karthik Teaser Review: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

related news

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

Kiran Abbavaram: నిర్మాతగానూ బిజీ అవ్వాలనుకుంటున్న కిరణ్‌ అబ్బవరం.. పెద్దగా వర్కవుట్‌ కాని ప్లాన్‌తో..

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

Sreeleela: అక్కడ లైనప్‌ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. తెలుగు మళ్లీ ఎప్పుడు?

trending news

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

1 hour ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

3 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

6 hours ago
Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

6 hours ago
OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

7 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది..  ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది.. ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

7 hours ago
Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

7 hours ago
Ravi K Chandran: ఎలివేషన్లపై స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Ravi K Chandran: ఎలివేషన్లపై స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

9 hours ago
Akira: ‘ఓజీ’ చూశాక అకీరా ఫస్ట్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

Akira: ‘ఓజీ’ చూశాక అకీరా ఫస్ట్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

9 hours ago
Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని  కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version