ఆ విషయంలో నితిన్ కు ఇది కొత్త ప్రయత్నమే..!

  • December 1, 2019 / 04:31 PM IST

సుమారు 12 ప్లాపుల తరువాత ‘ఇష్క్’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు నితిన్. ఈ చిత్రాన్ని స్వయంగా నితినే నిర్మించాడన్న సంగతి తెలిసిందే. ‘శ్రేష్ట్ మూవీస్’ బ్యానర్ ను స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మించాడు నితిన్. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ తరువాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఈ చిత్రం అయితే ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఉత్సాహంతో ‘చిన్నదాన నీకోసం’ ‘అఖిల్’ వంటి చిత్రాల్ని నిర్మించాడు. అయితే ‘చిన్నదాన నీకోసం’ చిత్రానికి లాభాలు వచ్చినప్పటికీ.. ‘అఖిల్’ చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. అప్పటివరకూ తన బ్యానర్ పై సంపాదించిందంతా ఈ చిత్రంతో పోగొట్టుకున్నాడు నితిన్. ఆతరువాత నిర్మాణం వైపు చూడలేదు నితిన్.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో కలిసి ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ చిత్రం కూడా పెద్ద ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ మాదిరి మిగిలిన హీరోలతో లో- బడ్జెట్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట నితిన్. ఇప్పటికే హిందీలో సూపర్ హిట్ అయిన ‘అందదున్’ చిత్రం రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేసాడట. ఓ చిన్న హీరోతో ఈ రీమేక్ ను నిర్మించాలని నితిన్ భావిస్తున్నాడట. ఎలాగు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా డిస్ట్రిబ్యూటరే కాబట్టి నితిన్ కు ఓ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి నితిన్ ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!             

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus