ఆసక్తి రేపుతోన్న నితిన్ కొత్త సినిమా టైటిల్..!

‘శ్రీనివాస కళ్యాణం’ వంటి డిజాస్టర్ తర్వాత ఏడాదికి పైనే గ్యాప్ తీసుకున్నాడు నితిన్. ప్రస్తుతం వెంకీ కుడుములు డైరెక్షన్లో ‘భీష్మ’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం తర్వాత చంద్రశేఖర్ యేలేటి, అలాగే వెంకీ అట్లూరి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు నితిన్.

ఇక చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ చిత్రం కథ కూడా ‘చదరంగం’ ఆట నేపథ్యంలోనే సాగుతుందట. అందుకే ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంతో అయినా హిట్ అందుకుని నితిన్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి..!

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus