పొరపాటున కూడా పదిహేను దాటద్దోంటున్నాడు…
- August 19, 2017 / 01:11 PM ISTByFilmy Focus
ఒక్కోసారి సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మీద కంటే హీరో మీదే ఎక్కువ పడుతుంటుంది. అలా తాజాగా బాగా ఎఫెక్ట్ అయిన హీరో నితిన్. సక్సెస్ మీట్ లో చాలా నిజాయితీగా “మా సినిమా అందరికీ నచ్చలేదు” అని మీడియా ముఖంగా సమ్మతించిన నితిన్.. తన తదుపరి సినిమా విషయంలో ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాడు.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో త్రివిక్రమ్ నిర్మాణసారధ్యంలో నితిన్ నటిస్తున్న “అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి” (వర్కింగ్ టైటిల్) సినిమా కూడా దాదాపు 70% అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే.. మునుపటి చిత్రం “లై” కూడా అమెరికాలోనే షూటింగ్ జరుపుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు తాజా చిత్రంలో జరగకూడదనే ధృడ నిశ్చయంతో.. ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు ఎక్కడా దాటకూడదు అనే రూల్ పెట్టుకొన్నాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం దాటకూడదనే స్ట్రిక్ట్ రూల్ పెట్టాడట నితిన్. మరి నితిన్ పెట్టిన రూల్ భారీ నేపధ్యంతోపాటు ఫారిన్ లో షూటింగ్ చేయాల్సిన ఈ చిత్రానికి ఎంతవరకూ సఫలీకృతమవుతుందో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















