Nithiin, Sreeleela: శ్రీ లీల డేట్స్ దొరికితే సంతోషపడే వాళ్ళం!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి శ్రీ లీల ఇప్పటికే వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తాజాగా ఈమె ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఈమె నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆడినరీ మ్యాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నితిన్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నితిన్ శ్రీ లీల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ శ్రీ లీల ఈరోజు ప్రమోషన్లకు రావాల్సి ఉంది కానీ ఆమె రేపు వస్తానని చెప్పింది రేపు కూడా వస్తుందో రాదో మాకు తెలియదని ఈయన తెలియజేశారు అయితే ప్రమోషన్ల వరకు మాత్రమే కాదని సినిమా షూటింగ్లో కూడా ఆమె మమ్మల్ని ఇలాగే టెన్షన్ పెట్టారని తెలిపారు.

శ్రీ లీల డేట్స్ దొరికితే మేము చాలా సంతోషపడే వాళ్ళం ఆమె ఎప్పుడు షూటింగ్ కి వస్తుందా అని ఎదురుచూసే వాళ్ళమని అంతగా తాను కెరియర్ పరంగా బిజీ అయ్యారని నితిన్ తెలిపారు. ఈరోజు వస్తుందని చెబుతుంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతుందని ఇలా ఆమె వస్తుందా రాదా అని ప్రతి రోజు మేము ఎంతో టెన్షన్ పడుతూ నరకం అనుభవించామని శ్రీ లీల బిజీ షెడ్యూల్ గురించి నితిన్ తెలిపారు.

ఈ విధంగా శ్రీ లీల గురించి నితిన్ (Nithiin) చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈమె వరుస సినిమాలలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు అయితే ఈమె నటించిన స్కంద ఆదికేశవ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భగవంత్ కేసరి సినిమా మాత్రం భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది మరి నితిన్ కి ఈమె ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus