సక్సెస్ ట్రాక్ నుంచి ఫెయిల్యూర్ ప్లాట్ ఫామ్ కి వచ్చాడు!

  • August 11, 2018 / 12:03 PM IST

తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఏ ఒక్క హీరోకి లేని ట్రాక్ రికార్డ్ ఒకటి నితిన్ పేరు మీద ఉంది. “సై” తర్వాత ఏకంగా 12 ఫ్లాపులు చవిచూశాడు నితిన్. అంటే నాలుగు హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకొన్నాడన్నమాట. తర్వాత మళ్ళీ “ఇష్క్”తో కమ్ బ్యాక్ అయ్యి.. అనంతరం “గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్” చిత్రాలతో హిట్స్ సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్ కొట్టాడు, ఆ తర్వాత మళ్ళీ చిన్నదాన నీకోసం, కొరియర్ బోయ్ కళ్యాణ్” ఫ్లాప్స్ గా నిలిచి నితిన్ వేగానికి స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. అయితే.. లక్కీగా మధ్యలో వచ్చిన “అ ఆ”తో మరో సూపర్ హిట్ సొంతం చేసుకొని ట్రాక్ ఎక్కాడు. కానీ.. అదృష్టం మళ్ళీ యూటర్న్ తీసుకొన్నట్లుంది, అందుకే “లై, చల్ మోహనరంగ” వరుసబెట్టి ఫ్లాపులుగా నిలిచాయి.

ఇక తాజాగా విడుదలైన “శ్రీనివాస కళ్యాణం”తో హిట్ కొడదామని ప్రయత్నించినప్పటికీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. 40+ లేదా 50+ కి తప్ప జనరల్ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ఏమీ సినిమాలో లేకపోవడంతో ప్రారంభవసూళ్ళు మాత్రమే కాదు వీకెండ్ కలెక్షన్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. దిల్ రాజు ఈ చిత్రాన్ని హిట్ సినిమాగా ప్రమోట్ చేయడానికి చాలా కష్టపడుతున్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. దాంతో.. “లై, చల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం”తో నితిన్ మళ్ళీ హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకొన్నాడు. ఇకనైనా నితిన్ ఎంచుకొనే స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మనోడి కెరీర్ కష్టాల్లో పడడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus