బుల్లితెర పై కూడా నితిన్ సోలోగానే వస్తున్నాడు..!

మహేష్ , బన్నీ ల ఫ్యాన్ ఫాలోయింగ్ కు… నితిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కు పొంతన ఎక్కడ? అసలు స్టార్ హీరోలతో మీడియం రేంజ్ హీరోకి పోటీ ఏంటి? అని చాలా మందికి అనుమానం రావచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కాదు. కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగ్గా పెర్ఫార్మ్ చెయ్యకపోయినప్పటికీ .. బుల్లితెర పై మాత్రం రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. టీవీల్లో చిన్న సినిమా .. పెద్ద సినిమా అనే తేడా ఉండడు.

పండగ టైంలో టెలికాస్ట్ చేస్తే భారీ టి.ఆర్.పి రేటింగ్లు నమోదవుతూ ఉంటాయి. ఈ లాక్ డౌన్ టైం లో సంక్రాంతి బ్లాక్ బస్టర్లైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం 29.4 టి.ఆర్.పి రేటింగ్ నమోదు చెయ్యగా…. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 23.4 టి.ఆర్.పి రేటింగ్ లను నమోదు చేసి సంచలనం సృష్టించాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ ఏడాది నితిన్ ‘భీష్మ’ చిత్రం సోలో రిలీజ్ ను దక్కించుకుంది. తద్వారా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరో విశేషం ఏమిటంటే..

బుల్లితెర పై కూడా ఈ చిత్రం సోలో రిలీజ్ ను సొంతం చేసుకుంది. దసరా కానుకగా ‘భీష్మ’ ప్రీమియర్ అక్టోబర్ 25న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు జెమినీ ఛానెల్ లో టెలికాస్ట్ కాబోతుంది. మిగిలిన ఛానల్స్ లో కూడా పోటీగా మరో పెద్ద సినిమా టెలికాస్ట్ కావడం లేదు.. కాబట్టి ‘భీష్మ’ చిత్రం మంచి టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసే అవకాశం ఉంది. అయితే ‘భీష్మ’.. ‘అల వైకుంఠపురములో’ మరియు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల టి.ఆర్.పి రేటింగ్ లను అధిగమిస్తుందా? అంటే కష్టమే అయినప్పటికీ అవకాశాలు అయితే ఉన్నాయి.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus