Nithya Menen: నిత్యామీనన్ లైఫ్ లో ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయా?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన నిత్యామీనన్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటున్న నిత్యామీనన్ అభినయ ప్రధాన పాత్రల్లోనే నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా నిత్యామీనన్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని సినిమాలలో ఈ బ్యూటీ నటిస్తున్నారు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ మీడియాతో ముచ్చటించారు. ఒక వ్యక్తి తనను ఆరు సంవత్సరాల పాటు వేధింపులకు గురి చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.

సంతోష్ వర్గీ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని ఆమె కామెంట్లు చేశారు. అతని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చాలామంది చెప్పారని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యక్తిని నేను క్షమించి వదిలేశానని నిత్యామీనన్ అన్నారు. సంతోష్ నన్ను చాలా రకాలుగా అన్ పాపులర్ చేశాడని ఆమె కామెంట్లు చేశారు. సంతోష్ విషయంలో నా తల్లీదండ్రులు కూడా అసహనం వ్యక్తం చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

నా గురించి సంతోష్ చెప్పే విషయాలు అసత్యాలని ఆ విషయాలను ఎవ్వరూ నమ్మవద్దని నిత్యామీనన్ కోరారు. సంతోష్ వర్గీ చెప్పిన విషయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని నిత్యామీనన్ కామెంట్లు చేశారు. మరోవైపు నిత్యామీనన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నిత్యామీనన్ ప్రస్తుతం ధనుష్ కు జోడీగా తిరు చిట్రంబలమ్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

నిత్యామీనన్ ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నిత్యామీనన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే నిత్యామీనన్ రెమ్యునరేషన్ తక్కువే కావడం గమనార్హం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus