పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిందా..?

‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది నిత్యామీనన్. ఆ తరువాత ‘ఇష్క్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ.. స్టార్ హోదా మాత్రం అందుకోలేకపోయింది. రీసెంట్ గా ఈమె నటించిన ‘నువ్విలా నువ్విలా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్-రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పక్కన హీరోయిన్లుగా సాయి పల్లవి. ఐశ్వర్యా రాజేష్ లను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి సిద్ధంగా లేదని.. ఇప్పుడు ఆమెకి బదులుగా నిత్యామీనన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.

పవన్ భార్యగా నిత్యాను తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. రీసెంట్ గా ఈ విషయమై నిత్యామీనన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ మాత్రం కాదంటుంది. కాబట్టి కచ్చితంగా నిత్యామీనన్ ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ మే నాటికి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus