Nithya Menen: ఆమె త‌ప్పితే మ‌రెవ‌రూ తనను ఫోర్స్ చేయరు : నిత్యామీనన్

దక్షిణాది ఇండస్ట్రీలో మోస్ట్ వర్సటైల్ టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఫస్ట్ నుంచి ఎక్స్ పోజింగ్ కు చాలా దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. గ్లామర్ రోల్స్ చేస్తే కొందరు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్నా నో అని చెప్పి కేవలం తన నటన మీదే ఆధారపడిన నటి నిత్యమీనన్.

తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో చాలా సినిమాలు చేసింది. ఇప్పటికీ తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా ఆమెకుమారి శ్రీ‌మ‌తి సినిమాతో పలకరించి హిట్ కొట్టింది. ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చి హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో ముప్పై సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూప‌ని అమ్మాయి పాత్రలో నిత్యా మీన‌న్ అద్భుతంగా నటించి ఆక‌ట్టుకుంది.

అయితే కుమారి శ్రీ‌మ‌తి సినిమా స‌క్సెస్ మీట్లో నిత్యామీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా పెళ్లి గురించి ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. తన పేరెంట్స్ తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపింది. తన పెళ్లి విష‌యంలోనూ ఎప్పుడూ వారు ఒత్తిడి తీసుకురాకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్పింది. కానీ తన బామ్మ మాత్రం తనో హీరోయిన్ అని కూడా చూడకుండా మాటలతో టార్చర్ పెట్టేదట.

ఇన్నేళ్ల వయసు వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ వేధించుకుని తినేదట. క‌నీసం తననో నటిగా కూడా గుర్తించేది కాదట. ఏం చేస్తున్నావ్‌..? జీవితంలో ఏం సాధించావ్‌..? ఇంకా ఎన్ని రోజులుంటావ్ పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా..? అంటూ మాటలతోనే చంపుకు తినేదట. ఆమె త‌ప్పితే మ‌రెవ‌రూ తనను (Nithya Menen) పెళ్లి విషయంలో ఫోర్స్ చేయలేదని చెప్పిుకొచ్చింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus