కంగనా మీద.. కౌంటర్ గాని వేసేసిందా..!

దివంగత ముఖ్యమంత్రి మరియు, నటి అయిన జయలలిత జీవితచరిత్రతో సినిమాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఓ వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందుతోంది. ‘ది క్వీన్‌’ పేరుతో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ ను డైరెక్ట్ చేస్తుండగా.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక కోలీవుడ్ డైరెక్టర్ విజయ్.. కంగనా తో ‘తలైవి’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన ఫస్ట్‌లుక్ ను అలాగే చిన్న టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే జయలలితగా కంగనారనౌత్‌ అస్సలు సూట్ అవ్వలేదని నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు కంగనా పై నిత్యమేనన్ కూడా సెటైర్ వేసిందా అంటూ చర్చ జరుగుతుండడం విశేషం. అసలు విషయం ఏమిటంటే.. నిత్యమేనన్ ప్రధాన పాత్రలో మరో జయలలిత బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రియదర్శి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా నిత్యమేనన్ ఈ బయోపిక్ పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘జయలలితగా నటించడానికి నేనే పర్ఫెక్ట్‌. జయలలిత మాదిరిగానే నేను నచ్చని విషయాల గురించి మొహం మీదే చెప్పేస్తాను. ఇప్పుడు జయలలిత పాత్రలో నటించనుండడంతో ఆమె గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను. ఆమెలా నటించడానికి నన్ను నేను తయారు చేసుకుంటున్నాను. జయలలిత పాత్రకు 100 శాతం శ్రమిస్తాను అంటూ నిత్యామీనన్‌ చెప్పుకొచ్చింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus