జయలలిత బయోపిక్ లో నటించనున్న నిత్యామీనన్

తమిళనాట త్వరలోనే సెట్స్‌పైకి రానుంది “జయలలిత” బయోపిక్‌. ఇప్పటికే జయలలిత జీవితంపై ఐదు ప్రాజెక్టులను ప్రకటించగా, అందులో ఇది ఒకటి. దర్శకుడు మిస్కిన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ప్రియదర్శిని ఈ సినిమాతో దర్శకురాలిగా మారనుంది. ఈ మూవీకి “ఐరన్‌ లేడీ” అనే టైటిల్‌ కూడా పెట్టారు. ఈ సినిమాలో నిత్యామీనన్‌ను లీడ్‌ రోల్‌ కోసం తీసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభంకానుంది. నిజానికి ఈ బయోపిక్‌లో మొన్నటివరకు త్రిష పేరు వినిపించింది. ఆ తర్వాత శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మి పేరు కూడా తెరపైకి వచ్చింది.

అయితే ఆకస్మాత్తుగా లీడ్‌ రోల్‌ మారిపోయింది. అందరినీ పక్కకు తప్పించి నిత్యామీనన్‌ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఐరన్‌ లేడీ సినిమాలో లీడ్‌ రోల్‌లో నిత్య నటిస్తేనే పూర్తి న్యాయం చేయగల్గుతుందని ఫిల్మ్‌మేకర్స్‌ భావించారు. అందుకే ఆమెను ఈ సినిమా కోసం ఎంపికచేశారు. ప్రియదర్శని డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని పేపర్ టేల్ సంస్థ నిర్మించనుంది. త్వరలో సినిమా అధికారంగా లాంచ్ కానుంది. ఇందులో సాధారణ నటి నుండి స్టార్ హీరోయిన్ గా ఆ తరవాత తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎదిగిన విధానాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రాజెక్ట్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus