ప్రస్తుతం సౌత్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంతో ఈ హవా స్టార్ట్ అయ్యింది. 2018 లో ‘మహానటి’ బ్లాక్- బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఒకటి ‘ఎన్టీఆర్ కధానాయకుడు’.. మరొకటి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. అంతే కాదు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ పేరుతో తెరకెక్కబోతుంది.
ఇదిలా ఉండగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితం ఆధారంగా ఒక బయోపిక్ ను రోప్పొందిస్తున్నారు. ‘ఐరన్ లేడీ’ ‘ఎ స్టోరీ ఆఫ్ రెవొల్యూషనరీ లీడర్’ అనేది టాగ్ లైన్. ఇక ఈ చిత్రాన్ని ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళనాడు ప్రజలు ‘అమ్మ’ అని పిలుచుకునే జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుండడం విశేషం. పేపర్‌టేల్ పిక్చర్స్ నిర్మాణ సంస్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి తమిళ ప్రజల ఆరాధ్య దేవతగా వెలుగొందిన జయలలిత జీవితంలోని ప్రధాన భాగాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. డిసెంబర్ 5 న జయలలిత వర్డంతి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.