Nithya Menen: బేబి బంప్ పిక్స్ పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చిన నిత్య మీనన్.. అసలేం జరిగిందంటే..?

మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నిత్య మీనన్.. జనాలని మళ్లీ గందరగోళంలో పడేసింది.. బేబి బంప్‌తో ఉన్న నిత్యను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిత్య మొన్నామధ్య ప్రెగ్నెన్సీ కిట్ ఫొటో పోస్ట్ చేసి అభిమానుల్ని అయోమయంలో పడేసింది. పాజిటివ్ కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో పాటు పాసిఫైయర్ ఉన్న ఇమేజ్ పోస్ట్ చేస్తూ ‘అండ్, ది వండర్ బిగిన్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో ఈ పోస్ట్ గురించి మీడియా, సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అయింది. సెలబ్రిటీలకు కూడా నిత్యా తన పోస్ట్ ద్వారా ఏం చెప్పబోతుందనేది అర్థం కాలేదు.. కొద్ది సేపటకి కానీ అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. నిత్య ప్రస్తుతం ‘వండర్ వుమెన్’ అనే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడంతో.. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా.. తన క్యారెక్టర్‌కి సంబంధించి ఇలా ఫొటో ద్వారా హింట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది.

కట్ చేస్తే.. ఇప్పుడు కొన్ని బేబి బంప్ పిక్స్ షేర్ చేసింది.. కాకపోతే ఈసారి ఎక్కువ టెన్షన్ పెట్టకుండా.. ‘ది వండర్ వుమెన్’ లో తను నోరా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాననే విషయాన్ని రివీల్ చేసింది.. నోరా రోల్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.. బిహైండ్ ది సీన్స్‌కి సంబంధించి మరిన్ని అడోరబుల్ పిక్స్ పోస్ట్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది.. పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ పార్వతి, పద్మ ప్రియ కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు.. అంజలి మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు.

‘వండర్ వుమెన్’ మూవీని ఇంగ్లీషులో తెరకెక్కించి.. మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ భాషల్లో డబ్ చేయనున్నారు. మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ధనుష్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్‌తో చేసిన హిందీ సిరీస్ ‘బ్రీత్ ఇన్‌టు ది షాడోస్’ సెకండ్ సీజన్‌లోనూ నటిస్తోంది.

1

2

3

4

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus