హైదరాబాద్ లో ఇల్లు తీసుకోవాలనుకుంటుందట?

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్ మేన్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టింది ఈ భామ. ఆ తరువాత కంగారు పడి సినిమాలు చేయకుండా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ వస్తుంది. అందుకే ‘నిన్నుకోరి’ ‘జై లవ కుశ’ ‘118’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి హిట్లందుకుంది. ఇక నివేదా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. జూన్ 28(రేవు) న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్లో బిజీగా గడుపుతుంది ఈ భామ.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నివేదా ‘బ్రోచేవారెవరురా’ చిత్రం గురించి అలాగే తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చింది. నివేదా మాట్లాడుతూ.. “బంధాలు .. భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. టాలీవుడ్లో మంచి ఆఫర్లతో బిజీగా ఉండడంతో తమిళ .. మలయాళ సినిమాల సంఖ్యను తగ్గించాను. హైదరాబాదులో ఇల్లు తీసుకోవాలనే ఆలోచనలో వున్నాను. త్వరలోనే ఆ పని పూర్తవడం .. నేను ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగిపోతాయి” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus