ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసిన నివేదా థామస్..!

నివేదా థామస్ కెరీర్ ప్రారంభం నుండీ విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ హిట్లు మీద హిట్లు కొడుతుంది. నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్ మేన్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత ‘నిన్నుకోరి’ ‘జై లవ కుశ’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్ అందుకుంది నివేదా థామస్. కళ్యాణ్ రామ్ తో చేసిన ‘118’ అలాగే శ్రీవిష్ణు తో చేసిన ‘బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. గ్లామర్ పాత్రలకి దూరంగా కథా ప్రాధాన్యత ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది ఈ బ్యూటీ.

ఇక తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సడెన్ గా దర్శనమిచ్చింది నివేదా థామస్. బ్లాక్ టాప్, షేడ్ జీన్స్ ధరించి ఎంతో స్టైలిష్ గా ఉంది ఈ బ్యూటీ. అప్పట్లో కాస్తా బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త సన్నబడింది. రజినీకాంత్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దర్బార్’ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఈమె చెన్నై నుండీ వచ్చిందట. ‘దర్బార్’ చిత్రంలో ఈమె రజినీకాంత్ కు కూతురిగా నటిస్తున్నట్టు గత కొంతకాలం నుండీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన ఇన్స్టా గ్రామ్ లో కూడా రజినీకాంత్ ఫోటోని షేర్ చేసి… ‘అప్పా’ అంటూ ఫైర్ సింబల్ ను జతచేసింది. ఇక నివేదా ఎయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus