పాపం…”ప్రభాస్”కు మళ్లీ నిరాశే మిగిలింది…

అవును నిజమే..ప్రభాస్ చాలా హర్ట్ అయ్యాడు…చాలా బాధ పడుతున్నాడు…దాదాపుగా మూడేళ్ళ నుంచి అన్నీ వదిలేసి మరీ బాహుబలి కోసం ఎంతో కష్టపడుతున్న ప్రభాస్ కష్టాన్ని సినిమా పరిశ్రమ గుర్తించడం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే…సినిమాకి ఎంత కష్టపడి, ఎంత బిగ్ హిట్ అయినా రాణి ఆనందం అవార్డ్స్ రూపంలో హీరోలకు దక్కుతుంది.

అయితే అదే క్రమంలో మొన్నటి ‘మా’ సినిమా అవార్డ్స్ షాక్ నుండి ఇంకా తేరుకోకుండానే నిన్నరాత్రి అత్యంత అట్టహాసంగా భాగ్యనగరంలో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో సైతం ప్రభాస్ కు చుక్కెదురయ్యింది…సెలెబ్రెటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్స్ ఎంపికలో ‘బాహుబలి’ అత్యధిక అవార్డులను గెలుచుకున్నప్పటికీ ప్రభాస్ మాత్రం చాలా బాధగా ఉన్నాడు. అదేంటి తన సినిమాకు అన్ని అవార్డ్స్ వచ్చినా ప్రభాస్ బాధకు కారణం ఏంటి అంటే…డైరెక్టర్ గా రాజమౌళి ఉత్తమ నిర్మాతగా శోభు యార్లగడ్డ అవార్డులు గెలుచుకోవడంతో పాటు ఉత్తమ సహాయనటిగా రమ్యకృష్ణ బెస్ట్ సినిమాటోగ్రఫర్ గా సెంథిల్ లు అవార్డులు గెలుచుకున్నారు.

వీరితో పాటు ఈ సినిమాలో  జీవనది పాట పాడిన గీతా మాధురికి కూడ బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు వచ్చింది. అదే క్రమంలో టాప్ హీరోలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బెస్ట్ యాక్టర్ అవార్డ్క్ ను మహేష్ తన ‘శ్రీమంతుడు’ సినిమాకు పొందాడు. అంతేకాకుండా డేబ్యూ మూవీస్ హిట్ కాకపోయినా, అఖిల్ కు బెస్ట్ డెబ్యూట్ హీరోగా, ‘కంచె’ సినిమాలో నటించిన ప్రగ్య జైస్వాల్ కు బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ అవార్డ్  కూడా దక్కాయి..కానీ  ‘బాహుబలి’ కోసం అన్నీ త్యాగం చేసుకుని నటించిన ప్రభాస్ కు ప్రతిష్టాత్మక అవార్డుల ఎంపికలో స్థానం లేకుండా పోవడం ప్రభాస్ ను, అతని ఫ్యాన్స్ ను చాలా హర్ట్ చేసింది…ఏది ఏమైనా…బాహుబలి2తో అయినా ప్రభాస్ దరికి ఈ అవార్డ్స్ వస్తాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus