ఇలా అయితే చాలా కష్టం నివేదా!

తాజాగా విడుదలైన ‘బ్రోచేవారెవరురా’ చిత్రానికి మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లు ప్రధాన పోషించారు. వీరితో పాటూ సత్యదేవ్, నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రలు పోషించారు. వీరిలో సత్య దేవ్ పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. కానీ నివేదా పేతురేజ్ నటన అంత ఆకర్షించేలా లేదు. నిజానికి ఆ పాత్రకి నటించే స్కోప్ కూడా లేకపోవడం గమనార్హం. అందుకే సత్యదేవ్ బాగా హైలెట్ అయ్యాడు. ఇది పక్కన పెట్టినా మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ నివేదా థామస్ ఉంది.

‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ తరువాత సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘చిత్రలహరి’ లో కూడా నటించింది. అయితే ఆ చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ గా కూడా కాకుండా ఏదో ఓ ముఖ్యమైన పాత్రంటూ ఆమెను ఇరికించారు. ఇప్పుడు అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో సైతం ఈమె సెకండ్ హీరోయినే. ఎందుకంటే ఆల్రెడీ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దే ఉండనే ఉంది. ఇలా సెకండ్ హీరోయిన్ పాత్రలకు మాత్రమే ఈ హీరోయిన్ ను ఎందుకు తీసుకుంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. మంచి టాలెంట్ ఉన్న నివేదా పేతురేజ్.. ఇలాంటి పాత్రల్నే ఎంచుకుంటూ పోతే.. ఆదా శర్మ, ప్రణీత ల మాదిరే మిగిలిపోయే ప్రమాదం ఉంది అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus