వచ్చే ఏడాది సంక్రాంతికి వరుస సినిమాలు పోటీ పడుతున్నాయి. దీంతో అందరూ తమ సినిమాల ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. కానీ అజిత్ ‘తునివు'(తెలుగులో తెగింపు) సినిమా మాత్రం చాలా కూల్ గా ఉంది. మొన్నామధ్య ఒక పోస్టర్ ని మాత్రం వదిలారు. అంతకుమించి ఇంకేమీ చేయలేదు. తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే తమిళంలో కూడా అలానే ఉంది. కేవలం హీరోకి ఉన్న క్రేజ్ తో వందల కోట్లు వచ్చేస్తాయనే ధీమాతో ఉన్నారు.
విజయ్ ‘వారసుడు’ సినిమా కోసం చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ చేసినా.. అజిత్ సినిమా టీమ్ లో కొంచెం కూడా చలనం లేదు. పబ్లిసిటీకి దూరంగా ఉండే అజిత్ ఈసారి కొంచెం యాక్టివ్ గా ఉండాలని అభిమానులు కోరుతున్నారు. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. నిజానికి అజిత్ టాలీవుడ్ మార్కెట్ పై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఆయన నటించిన సినిమాలకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు.
దీంతో మధ్యలో ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. తెలుగు ఆడియన్స్ పట్టించుకోలేదు. నిజానికి ఆయన నటించిన ‘వలిమై’ సినిమాలో సత్తా ఉన్నప్పటికీ.. తెలుగులో కనీసపు ప్రమోషన్స్ చేయకుండా అదే టైటిల్ తో రిలీజ్ చేయడంతో.. సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ‘తెగింపు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు.
విలన్ గ్యాంగ్ లకు పోటీగా భారీ చోరీలు చేస్తుంటాడు హీరో. పోలీసులకు దొరక్కుండా.. ఆయన వేరే ఎత్తులు పైఎత్తులను చాలా బలంగా రాసుకున్నారు దర్శకుడు వినోత్. చాలా ఏళ్ల క్రితం పంజాబ్ లో జరిగిన ఒక బ్యాంక్ దోపిడీని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారట. కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. తెలుగు చిరు, బాలయ్య, విజయ్ లాంటి హీరోలతో పోటీగా దిగుతున్నప్పుడు కనీసపు ప్రమోషన్స్ చేసుకోవాలి. అలా చేయకుండా ఈ ‘తెగింపు’ ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి!
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?