సినిమాలైనా వదిలేస్తా కానీ జబర్డస్త్ ను మాత్రం వదలను: నాగబాబు

  • April 16, 2019 / 08:04 PM IST

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో కంటే జబర్డస్త్ షో ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు అన్నది జగమెరిగిన సత్యం. అయితే.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాస్త బిజీ అయిన నాగబాబు కొన్ని వారాలుగా జబర్డస్త్ కి దూరంగా ఉంటున్నాడు. ఆయన స్థానంలో శేఖర్ మాస్టర్ లేదా జానీ మాస్టర్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. నరసాపురం నుంచి పోటీ చేస్తున్న నాగబాబు ఇకపై అక్కడ బిజీ అయిపోతాడేమో అని అందరూ అనుకున్నారు. అయితే.. ఇటీవల అక్కడ లోకల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాను కాబట్టి నా స్థానంలో వేరే వాళ్ళు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవకి అంకితం అవుతాను. అలాగే.. జబర్డస్త్ మాత్రం వదలను” అని జవాబిచ్చాడు.

నెల మొత్తంలో మహా అయితే 5 రోజుల్లో జబర్డస్త్ షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. సో, అదేమీ పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే.. రాజకీయాల్లోకి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి ఇకపై సినిమాలు మాత్రం తగ్గించేస్తాను.. కుదిరితే మానేస్తాను. అంతే తప్ప జబర్డస్త్ వదిలేసే ప్రసక్తి మాత్రం లేదు అని చెప్పాడు నాగబాబు. ఇదే సందర్భంలో తాను జబర్డస్త్ డబ్బుల కోసం చేయడం లేదని.. ఈ షో ద్వారా కొన్ని లక్షల మందిని నవ్విస్తూ సమాజ సేవ చేస్తున్నానని నాగబాబు చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus