10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో రూపొందే సినిమాలకే విడుదలకు రెండు వారాల ముందు నుంచి పబ్లిసిటీ మొదలెడుతుంటారు. అలాంటిది దాదాపు 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన నితిన్ “లై” చిత్రం విడుదలకు ఇంకా 8 రోజులు కూడా లేకపోయినా ఇంకా ప్రమోషన్ మొదలెట్టకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయిందేమోనన్న డౌట్ కూడా సోషల్ మీడియాలో గుప్పుమంది. దాంతో స్వయంగా నిర్మాత అనిల్ సుంకర, హీరో నితిన్ రంగంలోకి దిగి మరీ “మా సినిమా విడుదలలో ఎలాంటి మార్పు లేదు” అంటూ ట్విట్టర్ ద్వారా అందరికీ చెప్పాల్సి వచ్చింది.
అర్జెంటుగా ఆగస్ట్ 5న ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి.. యుద్ధప్రాతిపదికన పబ్లిసిటీ ప్రారంభించారు. మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. “నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక” వంటి మరో రెండు భారీ చిత్రాలతోపాటు విడుదలవుతున్న “లై” ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.