చెప్పిన టైమ్ కే వస్తానంటున్న రామ్..!

ఇస్మార్ట్ శంకర్ మూవీతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు హీరో రామ్.దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ చిత్రం 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక రామ్-పూరిలకు అత్యంత విలువైన విజయం ఈ చిత్రంతో దక్కింది. ప్రస్తుతం రామ్ రెడ్ మూవీలో నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ థ్రిల్లర్ తాడం కి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా రామ్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం.

ఐతే ఈ చిత్రం చెప్పినట్లు ఏప్రిల్ 9న విడుదలయ్యే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి. కరోనా వైరస్ భయంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడడానికి భయపడుతున్న తరుణంలో ఈ సినిమా విడుదల వాయిదా వేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఐతే తాజా సమాచారం ప్రకారం రెడ్ మూవీని చెప్పిన ప్రకారం ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారట. మూవీని వాయిదా వేసే ఆలోచన నిర్మాతలకు లేనట్లు తెలుస్తుంది. ఇక స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా…నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం కిషోర్ తిరుమల వహిస్తున్నారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus