Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

‘కాంటా లగా..’ ఈ పాటను పాడుకోని ఐటెమ్‌ సాంగ్స్‌ అభిమానులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆ పాట బీట్, అందులో షఫాలీ జరివాలా (Shefali Jariwala)  చేసిన డ్యాన్స్‌ అప్పటి కుర్రకారును అంతగా ఆకట్టుకున్నాయి మరి. ఆ పాట తర్వాత ఆమె అంతా మళ్లీ మెప్పించకపోయినా.. ఒక్క పాటతో లైఫ్‌కి కావాల్సినంత పేరు సంపాదించుకుంది షఫాలీ (Shefali). ఇప్పుడు ఇక ఈ జీవితం చాలు అని ఆమే అనుకుందో, దేవుడే అనుకున్నాడో, లేక ఇంకెవరైనా అనుకున్నారో ఏమో ఆ లైఫ్‌ ముగిసిపోయింది.

Shefali

ఈ మాటల్లో ఎక్కడో క్లారిటీ మిస్‌ అయింది కదా. అవును ఆమె మృతి వెనుక అనుమానాలున్నాయి. షఫాలీ జరివాలా కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ముంబయి పోలీసులు తాజాగా అప్‌డేట్‌ ఇచ్చారు. షఫాలీ మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షఫాలీకి ఏమైంది, ఎందుకు చనిపోయింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఘటన గురించి మాకు సమాచారం వచ్చింది.

అంధేరీలోని షఫాలీ నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌మార్టం నిమిత్తం షఫాలీ మృతదేహాన్ని కూపర్‌ హాస్పిటల్‌కు తరలించామని, ఆమె మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు అని ముంబయి పోలీసులు పేర్కొన్నారు. ఆమె అపార్ట్‌మెంట్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు తనిఖీ చేస్తున్నారని, పోలీసులు కూడా సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసును అనుమానాస్పద ఘటనగానే దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు ఈ రోజు ఉదయం షఫాలీ భర్త పరాగ్‌ త్యాగీ అపార్ట్‌మెంట్‌ బయట పెంపుడు శునకంతో సాధారణంగా నడుస్తూ కన్పించారని సమాచారం. శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురవడంతో ఆమెను తన భర్త పరాగ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో కార్డియాక్‌ అరెస్టుతో మృతిచెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయాన్ని కుటుంబసభ్యులు ధ్రువీకరించలేదు. ఇప్పుడు పోలీసులు కూడా ఇదే మాట అంటున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం చూస్తే తొలుత మ్యుజీషియన్‌ హర్మీత్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే విడిపోయారు. తర్వాత నటుడు పరాగ్‌ త్యాగీని వివాహమాడారు.

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus