Devara: అలా జరిగితే యంగ్ టైగర్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించడం ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా రంగానికి సంబంధించి అందరివాడు అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది జనవరిలోనే తారక్ నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చింది. 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా దాదాపుగా పోటీ లేనట్టేనని తెలుస్తోంది.

ఈ సినిమా రిలీజ్ సమయంలో పదిరోజులకు అటూఇటుగా సెలవులు ఉండగా ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలెక్షన్ల విషయంలో చరిత్ర సృష్టించడం ఖాయమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. సోలోగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు వరం అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

సముద్రంలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేవర సినిమా జాన్వీ కపూర్ కోరుకున్న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర (Devara) సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా నాన్ థియేట్రికల్ హక్కులతోనే సగం బడ్జెట్ ను రికవరీ చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందించాలని తారక్ భావిస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus