మరీ ఇలియానా 2 అంటే నమ్మడం కష్టంగా ఉంది

ఒక హీరోయిన్ కి క్రేజ్ రాక ముందు ఆమెను జనాలు పట్టించుకొంటారో లేదో తెలియదు కానీ.. ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే మాత్రం అమ్మడిని రంభ=ఊర్వశీతో పోల్చి నానా హడావుడి చేస్తుంటారు. ఇప్పుడు నభా నటేష్ పరిస్థితి కూడా అలానే తయారైంది. అమ్మడు తొలి చిత్రం “నన్ను దోచుకుందువటే”తోనే మంచి హిట్ అందుకోవడంతోపాటు ఆమె పెర్ఫార్మెన్స్ కి కూడా మంచి పేరొచ్చింది. అయితే.. తనకు వచ్చిన క్యూట్ ఇమేజ్ మొత్తాన్ని “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో హాట్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసిందనుకోండి.

ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. నభాను మన రాంగోపాల్ వర్మ “ఇలియానా 2” అని పొగడడం.. దాన్ని నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తుండడంతో.. నభా కూడా తనని తాను ఇలియానా అని ఊహల ప్రపంచంలో ఊరేగుతోందట. ఈ ఊహ ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కష్టమే. ఎందుకంటే.. ఎంత వర్మ ఇలియానా అని పొగిడినా.. ఇలియానా కల్ట్ ఫ్యాన్స్ మాత్రం ఆ పోలికను దిగమింగుకోలేకపోతున్నారు. దాంతో వాళ్ళందరూ నభాకు “నిన్ను మరీ ఎత్తేస్తున్నారు.. అవేమీ నమ్మకు, నీ టాలెంట్ నమ్ముకో” అని జాగ్రత్త చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus