ఈమారు ముద్దులు లేవు!
- May 24, 2016 / 02:11 PM ISTByFilmy Focus
గౌతమ్ మీనన్ తీసేవి యాక్షన్ సినిమాలే అయినప్పటికీ.. సదరు సినిమాలో రొమాన్స్ పాళ్ళు మాత్రం మెండుగా ఉంటాయి. కనీసం ఒక్క లిప్ లాక్ (అధర చుంబనం) అయినా ఉండి తీరాల్సిందే. ఆ కారణంగా ఆయన తాజా చిత్రం “సాహసం శ్వాసగా సాగిపో”లో కూడా నాగచైతన్య మరియు మంజీమా మోహన్ ల నడుమ లిప్ లాక్ సీన్ తప్పకుండా ఉంటుందని భావించారు సినిమా అభిమానులు.
అయితే.. “సాహసం శ్వాసగా సాగిపో” సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏవీ లేవని, రోమాంటిక్ యాక్షన్ త్రిల్లర్ అయినప్పటికీ.. సినిమాలో రొమాన్స్ కు ఎక్కువ అవకాశం లేదని, అందువల్ల సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండాల్సిన అవసరం లేదని దర్శకుడు గౌతమ్ మీనెన్ ఫీల్ అవ్వడంతో “సాహసం శ్వాసగా సాగిపో” సినిమాలో లిప్ లాక్ సీన్ లేకుండా అయిపోయింది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














