మా స్నేహానికి భాష, ప్రాంత భేదం లేదు

ఇరుగుపొరుగు ఇళ్లలోని వారు స్నేహితులవడంలో ప్రత్యేకత లేదు. అలాగే ఒకే ప్రాంతంలో నివసిస్తున్నవారు మిత్రులవడం సర్వసాధారణం. అయితే ప్రాంతంతో సంబంధం లేకుండా, భాష తో నిమిత్తం లేకుండా ఫ్రెండ్స్ అయితే నిజంగానే స్పెషల్. వారి గురించి అందరూ చెప్పుకుంటారు. సినీ పరిశ్రమలో అటువంటి ఫ్రెండ్స్ పై ఫోకస్..

అమితాబ్ బచ్చన్ & నాగార్జున 1992 లో వచ్చిన “కుదా గవా” అనే సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ & నాగార్జున మధ్య స్నేహం మొదలయింది. ఆ చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు. అప్పటి నుండి ఇప్పటి దాక ఎంతో స్నేహంగా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ స్నేహంతోనే అమితాబ్ మనం సినిమాలో నటించారు. అలాగే కలిసి ప్రకటనల్లో నటిస్తున్నారు.

అక్షయ్ కుమార్ & అసిన్వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.
మైక్రో మాక్స్ హెడ్ రాహుల్ ని ఆసిన్ కి అక్షయ్ కుమార్ పరిచయం చేశారు. వారి ప్రేమ పెళ్ళికి ప్రధాన కారణం అక్షయ్ కుమార్.

సల్మాన్ & రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా తప్పకుండా కలిసే వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి వల్ల వీరిద్దరి స్నేహితులయ్యారు. ‘జంజీర్’ షూటింగ్ కోసం ముంబై లో ఉంటే చరణ్ కి సల్మాన్ తన ఇంటి బిర్యానీ రుచి చూపించారు. అలాగే “ధృవ” సినిమా సమయంలో సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ ని చరణ్ కోసం పంపించారు.

సూర్య & ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ “బాహుబలి”, సూర్య ‘రాక్షసుడు’ షూటింగ్ ఒకే సమయంలో జరిగాయి. ఆ టైమ్ లో ఒకరి సెట్ కి మరొకరు వెళ్లి ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు.

రజినీకాంత్ & మోహన్ బాబు కెరీర్ మొదల్లో రజినీకాంత్, మోహన్ బాబులు స్నేహితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి స్నేహం చెక్కు చెదరలేదు. వియ్యంకులు కావాలనుకున్న కుదరలేదు. అయినా ఇద్దరి మధ్య దూరం పెరగలేదు.

రాశి ఖన్నా & వాణి కపూర్ సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో రాశి ఖన్నా & వాణి కపూర్ ఒకే రూంలో ఉండేవారు. రాశి ఖన్నా తన మోడలింగ్ ఏజెన్సీలో వాణి కపూర్ కి ఛాన్స్ ఇప్పించి కెరీర్ కి ఊతమిచ్చింది. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పరిశ్రమల్లో బిజీ హీరోయిన్స్ అయినప్పటికీ స్నేహితులుగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus