బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఏదైనా లవ్ స్టోరీ మాత్రం కామనే. అలాగే ఈసీజన్ లో అఖిల్ అండ్ మోనాల్ క్యూట్ లవ్ స్టోరీని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశాడు బిగ్ బాస్. అంతేకాదు, మధ్యలో అభిజిత్ ని కూడా కొన్ని వారాలు కలిపి ప్రేమదేశం సినిమాని ప్రొజెక్ట్ చేశారు. అయితే, లాస్ట్ వీక్ మోనాల్ నామినేషన్స్ తర్వాత ఫ్రెండ్ కాదు, మోర్ కావాలి అంటూ అమ్మరాజశేఖర్ మాస్టర్ తో అన్న మాటలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ క్లిప్పింగ్స్ చక్కర్లు కూడా కొట్టాయి.
అయితే, శనివారం ఎపిసోడ్ లో వీటన్నింటికి చెక్ పెట్టేలా పార్టిసిపెంట్స్ ని డైరెక్ట్ గా అడిగాడు నాగార్జున. అంతేకాదు, లాస్ట్ వీక్ నువ్వు లోన్లీగా ఉన్నావ్ అని, అసలు రీజన్ చెప్పమని అడిగాడు నాగార్జున. దీంతో మోనాల్ అఖిల్ తనని నామినేట్ చేయడం అస్సలు నచ్చలేదని చెప్పింది. తనతో చాలాసార్లు మాట్లాడటానికి వెళ్లాను అని కానీ, పట్టించుకోలేదని చెప్పింది. ఈ హౌస్ లో నాకు దొరికిన ఫ్యామిలీ మెంబర్ అఖిల్ ఒక్కడే అని చెప్పి మోనాల్ ఎమోషనల్ అయ్యింది.
అఖిల్ మాత్రం తన గేమ్ ఇంప్రూవ్ అయ్యేందుకు నేను ఇలా నామినేట్ చేశాను అని, అందుకే టి స్టాండ్ టాస్క్ లో మోనాల్ మొండిగా , ధైర్యంగా గేమ్ ఆడిందని చెప్పాడు. అంతేకాదు, టాస్క్ లలో చాలా లేజీగా ఉంటోందని, లేట్ గా వస్తూ పార్టిసిపెషన్ కూడా చాలాతక్కువగా ఉంటోందని అన్నాడు. అందుకే అలా చేశాను తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదని చెప్పాడు. అయితే, ఇక్కడ నాగార్జున సూటిగా మోనాల్ నీకు ఫ్రెండా..? అంత కన్నా ఎక్కువా..? అని అడిగేసరికి, ఆలోచించి మరీ అఖిల్ జస్ట్ ఫ్రెండ్ అంతే అన్నాడు. మోనాల్ కూడా నాకు అఖిల్ మంచి ఫ్రెండ్ అని చెప్పింది. దీంతో ఇద్దరిమధ్యలో ఉన్న నల్లని మేఘాలు తొలిగిపోయినట్లుగా అయ్యింది.
ఇద్దరూ హ్యాపీగా హగ్ చేసుకుని మళ్లీ హౌస్ లో తమ జెర్నీని స్టార్ట్ చేశారు. అదీ మేటర్.