ఇటీవల రామ్ చరణ్ ఇకపై తన సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ కౌంట్ ఉండబోదని, ఈ మేరకు నిర్మాతలను కూడా కోరతానని చెప్పిన విషయం తెలిసిందే. అందుకు కారణం “రంగస్థలం, భరత్ అనే నేను” సినిమాల రిలీజ్ టైమ్ లో కలెక్షన్స్ & రికార్డ్స్ విషయంలో జరిగిన రచ్చను దృష్టిలో పెట్టుకొని చరణ్ ఆ నిర్ణయం తీసుకొన్నాడు. అయితే.. ఈ కలెక్షన్స్ విషయంలో ట్రాన్స్ పెరసీ ఎందుకు ఉండడం లేదు? ఓవర్సీస్ తరహాలో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్ ఇండియాలోనూ ప్రారంభం అయినప్పటికీ.. ఫైనల్ కౌంటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ ఉండడం లేదు. అందుకే నిర్మాతలు ఇష్టమొచ్చినట్లు కలెక్షన్స్ కౌంట్ తో పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ పోస్టర్స్ ను బేస్ చేసుకొని ఫ్యాన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పిచ్చిపిచ్చిగా మాటల, కామెంట్ల యుద్ధం చేసుకొంటున్నారు.
ఈ యుద్ధాలను అరికట్టాడానికి ఎవరో ఒకరు నడుం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. హీరోలు, నిర్మాతలు ఎలాగూ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి ఓవర్సీస్ లో కలెక్షన్స్ కి అఫీషియల్ కేరాఫ్ అడ్రెస్ గా మారిన “రెంట్రాక్” (Rentrak) సంస్థ ఇండియాలోనూ అఫీషియల్ గా తమ సంస్థను విస్తరించనుందని తెలుస్తోంది. ఈ వార్త గనుక నిజమైతే.. తెలుగు చిత్రసీమలో ఫేక్ కలెక్షన్స్ కి కాలం చెల్లినట్లే.