మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్ అనే నేను’ విడుదలై ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అలాంటిది ఆయన సినిమా విడుదలై మూడేళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకు మరో సినిమాను రిలీజ్ చేయలేకపోవడమంటే బ్యాడ్ లక్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనుకున్న తరువాత వరుసగా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. దాని వలనే ఆలస్యమవుతుంది. ముందుగా సినిమాలో రెండో హీరో కోసం మహేష్ ను తీసుకోవాలనుకున్నారు.
కానీ ఫైనల్ గా రామ్ చరణ్ ను ఫిక్స్ చేశారు. కానీ అతడు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి పర్మిషన్ తీసుకొని రావడానికి ఆలస్యం కావడం, కరోనా ఎఫెక్ట్ అన్నీ కలిసి ‘ఆచార్య’ సినిమాను వెనక్కి నెడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ‘ఆచార్యా’ తరువాత సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు కొరటాల. అల్లు అర్జున్ హీరోగా సినిమా అనుకున్నారు. కానీ ‘పుష్ప’ రెండు భాగాలుగా తీయాలని నిర్ణయయించుకోవడంతో బన్నీ ఇప్పట్లో రాడని తెలిసి.. ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కి కరోనా రావడం, అది కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం కావడం వంటి విషయాలు కొరటాల సినిమా మరింత లేట్ అవుతుందని స్పష్టం చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్ట్ నాటికీ ‘ఆచార్య’ పూర్తవుతుంది. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా మొదలుపెట్టినా.. అది ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తరువాతే విడుదల చేయాలి. అంటే 2022 సమ్మర్ తరువాతే. ఈ లెక్కన చూస్తుంటే కొరటాల చేసుకున్న ప్లాన్స్ ఏవీ కూడా సరిగ్గా వర్కవుట్ అవ్వడం లేదనిపిస్తుంది!
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!