అప్పుడు మిస్ చేసుకుని ఇప్పుడు వెతుక్కుంటే ఏం లాభం..!

ప్రియా ప్రకాష్ వారియర్ ఈ పేరు గురించి కానీ.. ఈ ముద్దుగుమ్మ గురించి కానీ పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ‘ఓరు అదార్ లవ్’ అనే చిత్రంలో కన్నుకొట్టిన ఓ వీడియో ప్రోమో తో ఈ భామకు అంత క్రేజ్ వచ్చింది. దీంతో ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎగబడ్డారు దర్శకనిర్మాతలు. తెలుగు సినిమాల్లో కూడా ఈమెను హీరోయిన్ గా తీసుకోవడానికి కూడా ఇక్కడి దర్శకనిర్మాతలు కూడా ట్రై చేశారు.

కానీ ఈ అమ్మడు పెద్ద ‘ఓరు ఆదార్ లవ్’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. దాంతో రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో దర్శకనిర్మాతలు ఈమెకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఈమెనే రెవర్స్ లో వారికి ఫోన్ లు చేసినా .. ఇగ్నోర్ చేస్తున్నట్టు సమాచారం. ఈమె తరువాత సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ కూడా వివాదాల కారణంగా విడుదల కావడం లేదు. ఇక తెలుగులో మాత్రం నితిన్.. చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus