Rajasaab: అందరూ వదిలేసిన అనాధ ‘రాజా సాబ్‌’.. ప్రచారం ఊసెత్తని టీమ్‌.. ఏమైంది?

ఎంత బాగోలేకపోయినా సినిమా అయినా సరే.. సంక్రాంతి రోజుల్లో మంచి వసూళ్లు వస్తాయి అంటారు టాలీవుడ్‌లో. అందుకే పెద్ద సినిమాలు ఉన్నా చిన్న సినిమాలు కొన్ని రిలీజ్‌కి డేరింగ్‌ చేసి దిగుతాయి. పెద్ద సినిమాల హౌస్‌ఫుల్‌ బోర్డులు తమకు వసూళ్లు అందిస్తాయని నమ్ముతారు. అందుకు తగ్గట్టే సినిమా కాస్త డౌన్‌ అయినా ప్రచారం చేసి బాగా లేపుతారు. కానీ ఏమైందో ఏమో ‘ప్రభాస్‌ రాజాసాబ్’ సినిమాకు ఇదే మిస్‌ అయింది. అక్కడా బాగుంది అనేవారు ఉన్నా.. సినిమా ప్రచారం లేకపోవడంతో బాగా దెబ్బేసింది.

Rajasaab

గతేడాది ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో దిల్‌ రాజు అండ్‌ కో. చేసిందిదే. సినిమా ఫలితం కాస్త తేడా కొట్టగానే ఠక్కున అందరూ గప్‌చుప్‌ అనేలా కామ్‌ అయిపోయారు. ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ పనులు ఉండటంతో అటు వెళ్లిపోయారు. ఇది ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను ఇంకా ఎక్కువ డ్యామేజ్‌ చేసింది. ట్రోలింగ్‌లు, బ్యాడ్‌ రివ్యూలను ఆపకపోయినా ఫర్వాలేదు. సంక్రాంతి సినిమాకు ఇవ్వాల్సిన ప్రచారం చేయలేదు. అచ్చంగా ఇప్పుడు ‘రాజాసాబ్‌’ విషయంలోనూ అదే జరుగుతోంది.

ఈ సినిమా విడుదల ముందు మూడు పీఆర్‌ టీమ్‌లు భారీగానే పని చేశాయి. హీరో వైపు నుండి ఒక టీమ్‌, నిర్మాత వైపు నుండి ఒక టీమ్‌, డైరక్టర్‌ వైపు నుండి ఒక టీమ్‌.. వీళ్లు కాకుండా బొంబాయి పీఆర్‌ ఏజెన్సీ పని చేశాయి. దానికి తగ్గట్టే సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మారుతి, ఎస్కేఎన్‌ బాగా ఓవర్‌ చేశారు. ఈ మాట మేం అనేది కాదు. ప్రభాస్‌ ఫ్యాన్సే అంటున్నారు ఇప్పుడు. అయితే వీరంతా ఇప్పుడు కనిపించడం లేదు. అవును నిజమే తర్వాత వచ్చిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ సినిమాలకు ‘రాజాసాబ్‌’ కంటే మంచి టాకే వచ్చింది.

అయినప్పటికీ అలా వదిలేయడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రభాస్‌ అంటే ప్రచారానికి ఎప్పుడూ ఇలానే చేస్తాడు. సినిమా రిలీజ్‌ అయ్యాక తనకు పట్టనట్టే ఉంటాడు. మరి మిగిలిన వారు కూడా ‘రాజాసాబ్‌’ని అనాధలా వదిలేయడం ఏంటో అర్థం కావడం లేదు. ఆఖరికి సినిమాను బతికించండి అంటూ అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేసే తమన్‌ కూడా ప్రచారం చేయడం లేదు. ఏమైందో మరి.

ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి అప్డేట్ వచ్చేస్తోందిగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus