Venu Yeldandi : ఎట్టకేలకు ‘ఎల్లమ్మ’ నుంచి మొదటి అప్డేట్ వచ్చేస్తోందిగా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ‘ఎల్లమ్మ’ ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సెన్సేషనల్ హిట్ ‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదట్లో హీరోగా నాని పేరు వినిపించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నితిన్ పేరు ఖరారైందని ప్రచారం జరిగినా, ఆయన కూడా బయటకు వచ్చారన్న రూమర్లు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. దీంతో అసలు సినిమా జరుగుతోందా? హీరో ఎవరు? అనే సందేహాలు బలంగా వినిపించాయి.

Venu Yeldandi

ఈ నేపథ్యంలో నిన్న (జనవరి 14) ‘ఎల్లమ్మ’ చిత్ర యూనిట్ నుంచి వచ్చిన పోస్టర్ ఒకటి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ గ్లింప్స్ ద్వారా కథా నేపథ్యం, టోన్, అలాగే సినిమా ప్రస్తుతం ఉన్న దశపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

హీరోయిన్ విషయంలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట కీర్తి సురేష్ పేరు వినిపించినా, ఆమె స్వయంగా ఆ వార్తలను ఖండించారు. గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ అంశంపై క్లారిటీ రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాపై, బలగం తర్వాత వేణు యెల్దండి మరో బలమైన కథతో వస్తాడన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. జనవరి 15న వచ్చే గ్లింప్స్… ఎల్లమ్మపై ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందా? లేదంటే కొత్త ఆసక్తిని రేపుతుందా? చూడాలి.

AA23 నక్కలపై సింహం వేట.. లోకేష్ ప్లాన్ ఏంటీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus