‘ఆర్ ఆర్ ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ‘దేవర’ (Devara) అనే సినిమా వచ్చింది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) సూపర్ హిట్ అవ్వడంతో ‘దేవర’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొదటి రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బి,సి సెంటర్ ఆడియన్స్ ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా తెగ చూశారు. అలా ఆ సినిమా సేఫ్ అయిపోవడమే కాదు బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల వరకు వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
అంతేకాదు 50 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం, 4 కేంద్రాల్లో శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది ‘దేవర’ చిత్రం. అయినప్పటికీ ఎందుకో ఈ సినిమాని అభిమానులే చిన్న చూపు చూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ‘దేవర’ ఓటీటీలో రిలీజ్ అయ్యాక చాలా నెగిటివ్ రెస్పాన్స్ వినిపించింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది. ప్లాప్ సినిమాలకి ట్రోలింగ్ కామన్. కానీ హిట్టు సినిమాకు కూడా ఈ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు.
పైగా ఈ సినిమాకు సీక్వెల్ అవసరం లేదు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో ‘దేవర 2’ (Devara 2) ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ‘దేవర 2′ ఉంటుంది కచ్చితంగా ఉండి తీరుతుంది’ అంటూ స్వయంగా ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆ సీక్వెల్ ను పట్టించుకోవడం లేదు అని స్పష్టమవుతుంది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.
అభిమానులంతా ‘వార్ 2’ (War 2) సినిమా గురించి, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘డ్రాగన్’ (Dragon) పోస్టర్స్ గురించి, అలాగే నెల్సన్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉండటం గమనార్హం. సో దీనిని బట్టి ‘దేవర 2’ పై ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఆసక్తి లేదని అర్థం చేసుకోవచ్చు.
No one asked DeVARA2 Update on NTR Birthday pic.twitter.com/lLFtwQLI5R
— Mind off Person (@SK_Tarock) May 20, 2025