ఇస్మార్ట్ శంకర్ హిట్ వల్ల ఆ ఇద్దరికి ఒరిగిందేమీ లేదు.. !

  • March 19, 2020 / 03:24 PM IST

ఇస్మార్ట్ శంకర్ హిట్ పూరి టీమ్ కి ఊపిరి పోసింది. దర్శకుడిగా, నిర్మాతగా సర్వం కోల్పోయే స్థితిలో ఉన్న డైరెక్టర్ పూరి ఆయన సహ నిర్మాత ఛార్మిలను ఈ చిత్రం గట్టున పడేసింది. ఊహించని రీతిలో ఈ చిత్రం 75కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి ఆశ్చర్యపరిచింది. ఈ మూవీతో పూరి అండ్ ఛార్మి టీమ్ బాగానే గడించారు. ఇక హీరో రామ్ సైతం ఎన్నో ఏళ్ల తరువాత ఓ క్లీన్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.ఊర మాస్ తెలంగాణ పోరగాడిగా రామ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. రామ్ ఈ చిత్రంతో తన ఇమేజ్ కొంచెం పెంచుకున్నాడు అనడంలో సందేహం లేదు.

మరి ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ సంగతేమిటంటే క్వశ్చన్ మార్కె. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద హిట్ కొట్టినా, ఈ ఇద్దరు భామల ఫేట్ మారలేదు. కనీసం ఒక స్థాయి హీరో సినిమాలో వారికి అవకాశం రాలేదు. నిధితో పోల్చుకుంటే నభా కొంచెం బెటర్. ఆమెకు కనీసం రవి తేజ సరసన డిస్కో రాజా చేసే అవకాశం దక్కించుకుంది. అలాగే సాయి ధరమ్ హీరోగా వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంలో నటిస్తుంది. నిధి మాత్రం కనీసం ఈ స్థాయి అవకాశాలు కూడా దక్కించుకోలేకపోయింది. ఆమె తెలుగులో ప్రస్తుతం మహేష్ మేనల్లుడు గల్లా జయ్ దేవ్ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతకు మించి ఆమెకు సరైన ఆఫర్స్ లేవు. కానీ ఇస్మార్ట్ శంకర్ తరువాత వీరికి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వస్తాయని భావించారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus