Gopichand: ‘ఆరడుగుల బుల్లెట్’.. గోపీచంద్ కనీసం పట్టించుకోవడం లేదుగా..!

4 ఏళ్ళ క్రితం అంటే 2017 లో విడుదల కావాల్సిన సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’ ..!గోపీచంద్,నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఫేడౌట్ అయిపోయిన స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దీనికి దర్శకుడు. మణిశర్మ సంగీత దర్శకుడు. మెరుపులు చాలానే ఉన్నాయి. ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయిన ఈ సినిమా ఆ అడ్డంకులను తొలగించుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ.. పైగా మాస్ సినిమా కావడంతో జనాలు ఈ సినిమా గురించి బాగానే వెయిట్ చేస్తున్నారు.

కానీ హీరో, హీరోయిన్లు అలాగే మిగిలిన తారాగణం మాత్రం ఈ సినిమా వైపు కన్నెత్తి చూడడం లేదు.నిన్న ట్రైలర్ రిలీజ్ అయితే హీరో గోపీచంద్ కూడా ఓ ట్వీట్ వేసింది లేదు. ‘సీటీమార్’ హిట్ అయ్యింది కదా అని నిర్మాతలు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ఉంది తప్ప హీరో గోపీచంద్ కు ఈ సినిమా రిలీజ్ అవ్వడం అస్సలు ఇష్టం లేదని ఇన్సైడ్ టాక్. ‘సీటీమార్’ చిత్రం హిట్ అయినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కు కిందా మీదా పడింది.

దానికి కారణం అంతకు ముందు గోపి చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడం మూలానే..! అయితే ‘సీటీమార్’ తో ఫామ్లోకి వచ్చిన గోపి కొన్నాళ్ళ పాటు ఆ హిట్ ఇచ్చిన జోష్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసమే ‘ఆరడుగుల బుల్లెట్’ ను అతను పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే నటీనటులు ప్రమోషన్ కు వస్తారేమో చూడాలి..!

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus