Game Changer: అంతా బాగుంది… ఆ ఒక్క విషయమూ చెప్పేసుంటే బాగుండేదిగా!

‘జరగండి’ అంటూ స్పెషల్‌ డే నాడు రామ్‌చరణ్‌ (Ram Charan) వచ్చేశాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలోని ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. బీట్‌, లిరిక్‌ భలే ఉన్నాయి. ఇక రామ్‌ చరణ్‌ లుక్‌… కియారా అడ్వాణీ (Kiara Advani) భలే క్యూట్‌గా ఉన్నారు. ఇదంతా హ్యాపీనే కానీ… మరో విషయం కూడా ఉండుంటే ఫ్యాన్స్‌ ఇంకాస్త ఖుషీ అయ్యేవారు. ఈ రోజుకు ఇది చాలు అంటూ రిలాక్స్‌ అయిపోయేవారు. అది లేకపోవడంతో ‘జరగండి’ పాటను ఎంజాయ్‌ చేయలేకపోతున్నారామో అనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. ఏంటా మిస్సింగ్‌ అనేదేగా మీ డౌట్.

రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ పేజీలు చూస్తే… మీకే కనిపిస్తోంది. ‘ఒక్కటి తక్కువైంది’ అంటూ సినిమా రిలీజ్‌ డేట్‌ కోసం అడుగుతున్నారు. అవును పాటలో రిలీజ్‌ డేట్‌ కూడా ఇస్తారు అని ఆశించిన ఫ్యాన్స్‌కు భంగపాటే ఎదురైంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా మళ్లీ స్టార్ట్‌ అయ్యింది. త్వరగా షూటింగ్‌ ఫినిష్‌ చేస్తారని, రిలీజ్ డేట్‌ ఇచ్చేస్తారని కూడా మాట్లాడుకున్నాం ఇన్నాళ్లూ. ఆ డేట్‌ను రామ్‌చరణ్‌ స్పెషల్‌ డేట్ నాడు చెబుతారేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చూస్తే.. అదేమీ లేదు.

దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ ఏంటి? అనే చర్చ మళ్లీ మొదలైంది. అయితే సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇంకా చర్చలు సాగుతున్నాయని, ఓ సాలిడ్‌ డేట్‌ చూసి ఈ ఏడాదిలోనే విడుదల చేస్తారని సినిమా టీమ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఆ డేట్‌ ఏంటనేది త్వరలో అనౌన్స్‌ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక చరణ్‌ సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం శంకర్‌ (Shankar) – దిల్‌ రాజుల (Dil Raju)  ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నారు.

దీని తర్వాత బుచ్చిబాబుతో (Buchi Babu) ‘పెద్ది’ (RC16/Peddi)  ( ప్రచారంలో ఉన్న టైటిల్‌) చేస్తారు. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌ – సుకుమార్‌ల (Sukumar) సినిమా చేస్తారు. ‘రంగ స్థలం’ (Rangasthalam) సినిమా తర్వాత ఈ కాంబినేషన్‌ నుండి వస్తున్న సినిమ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ ఇప్పటికే షూట్‌ చేసేశారని కూడా అంటున్నారు. అదిరిపోయిందని రాజమౌళి కూడా చెప్పారు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus