ఈమధ్య సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. తీయడానికి పడే కష్టం కంటే కాస్త ఎక్కువగానే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. చిన్న సినిమాల వరకైతే పర్లేదు కానీ.. ఈమధ్య మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. తాజాగా మంచు మనోజ్ తాజా చిత్రమైన “ఒక్కడు మిగిలాడు”కి కూడా ఈ సమస్యలు తప్పట్లేదు. ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడి ఎట్టకేలకు నవంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. అజయ్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కిన “ఒక్కడు మిగిలాడు” ద్వారా ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఇండస్ట్రీకి పరిచయమవుదామనుకొన్నారు. సినిమా రైట్స్ కూడా కొనుక్కొన్నారు.
ఏషియన్ సినిమాస్ సంస్థతో డిస్ట్రిబ్యూషన్ సెట్ చేసుకొన్నారు. తొలుత 50 థియేటర్ల దాకా హైద్రాబాద్ లో రిలీజ్ చేద్దామనుకొన్నాక ఆఖరి నిమిషంలో థియేటర్లు లేవు అంటూ చేతులెత్తేసారట. దాంతో దర్శకుడు అజయ్ ఆండ్రూస్ దాదాపు ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్స్ మీద చెయ్యి చేసుకొన్నంత పనిచేశాడట. దిల్ రాజు దగ్గరుండడంతో ఆ గొడవ ఎక్కువ దూరం వెళ్లకుండా ఆగిందట. చూస్తుంటే.. ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదు.