మోహన్ బాబు…ఇది మరీను!!!

  • April 25, 2016 / 06:36 AM IST

సహజంగా విజయం గర్వాన్ని పెంచుతుంది అంటారు. అది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, మంచు వారి అబ్బాయికి మాత్రం తాజా హిట్ ‘ఈడోరకం-ఆడోరకం’ కాస్త గర్వాన్ని పెంచింది అన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడిన తీరు, పైగా దర్శకులపై, హీరోలపై వేసిన శెటైర్లు అన్నీ వెరసి ఆయన్ని విమర్శల పాలు చేశాయి.

ఇదిలా ఉంటే అదే బాటలో తండ్రి మోహన్ బాబు సైతం కాస్త అతిగా ప్రవర్తిస్తున్నాడు అన్న టాక్ టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తుంది..ఇంతకీ విషయం ఏంటంటే…కొడుకు సినిమా హిట్ కావడంతో మోహన్ బాబు తన అభిప్రాయాన్ని తెలియపరచేలా తాను సినిమా చూస్తానంటే మల్టీప్లెక్స్ లో టికెట్స్ లేవని చెప్పారని..ఇక సినిమా నిర్మాత అనీల్ సుంకరకు ఫోన్ చేసి శనివారం నాడు టికెట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా శనివారం కూడా తాను చాలా టికెట్స్ అడిగితే కొన్ని మాత్రమే ఇచ్చాడని అన్నారు. అంటే ఇన్‌డైరెక్ట్ గా, తన కొడుకు హిట్ సాధించాడనే విషయాన్ని కాస్త తన స్టైల్ లో చెప్పే ప్రయత్నం చేశారంట మన కలెక్షన్ కింగ్. అయితే అది కాస్త విమర్శలకు దారి తీసింది, ఎలా అంటే…నిజంగా మోహన్ బాబు సినిమా చూడాలనుకుంటే స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకోగల సత్తా ఉండి కూడా తాను ఆడియెన్స్ తో చూడదలచుకున్నా టికెట్స్ లేవు అని మోసేయడం మరీ అతిగా ఉంది అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. ఏది ఏమైనా… సూపర్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పండిస్తూ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus