‘మిస్ ఇండియా’ను మర్చిపోయారా..?

అప్పటివరకు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోన్న కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా భారీ సక్సెస్ ని అందుకుంది. నేషనల్ అవార్డులను సైతం దక్కించుకొని తన టాలెంట్ ని నిరూపించుకుంది. ఈ సినిమా తరువాత కీర్తికి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ‘మిస్ ఇండియా’ అనే సినిమా ఓకే చేసింది కీర్తి. మహేష్ కోనేరు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. నరేంద్ర నాథ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. నిజానికి ‘పెంగ్విన్’, ‘గుడ్ లక్ సఖీ’ లాంటి సినిమాల కంటే ముందే ‘మిస్ ఇండియా’ సినిమా మొదలైంది.

‘పెంగ్విన్’ సినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయింది. అలానే ‘గుడ్ లక్ సఖీ’ సినిమాకి మీడియాలో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ నగేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించి పలు ప్రమోషన్స్ చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కానీ ‘మిస్ ఇండియా’ సినిమా గురించి అసలు చప్పుడే లేదు. అప్పుడెప్పుడో టీజర్ రిలీజ్ చేసి ఊరుకున్నారు. అప్పటినుండి ఎలాంటి అప్డేట్ లేదు.

వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కీర్తి సురేష్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. మరి మేకర్స్ ఈ సినిమా గురించి ఏం ఆలోచిస్తున్నారో..?

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus