Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో ఏం జరిగింది ? ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్..!

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ హీటెక్కాయి. హౌస్ మేట్స్ ఫోటోలు మంటల్లో కాలుతుంటే ఆ సెగలు హౌస్ ని కుదిపేశాయి. ముఖ్యంగా యావర్ – సందీప్, పల్లవి – అమర్ ల మద్యలో గొడవ తారాస్థాయికీ చేరింది. యావర్ ఫస్ట్ శోభాశెట్టిని నామినేట్ చేస్తూ నేను నిన్ను హిట్లర్ అని అనలేదని చెప్పాడు. నిజంగానే శోభాశెట్టిని హిట్లర్ అని అనలేదు. తనని తాను హిట్లర్ లా పాలిస్తున్నాను అనుకున్నావా అంటూ మాట్లాడాడు తప్పితే, శోభాని అనలేదు. ఇక వీళ్లిద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ తో పాటుగా, సందీప్ తో కూడా యావర్ కి గట్టిగా పడింది.

ఇంతవరకూ నువ్వు నామినేషన్స్ లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నావని నాకు అనిపిస్తోందని చెప్పాడు. ఇక్కడే సందీప్ రెచ్చిపోయాడు. నీకంటే సేఫ్ ప్లేయర్ ఈ హౌస్ లో ఎవ్వరూ ఉండరంటూ వాగ్వివాదానికి దిగాడు. ఇక్కడే ప్రిన్స్ అందుకే నేను స్టార్టింగ్ నుంచీ నామినేషన్స్ లో ఉన్నాను అన్నాడు. దీనికి కౌంటర్ గా స్టార్టింగ్ నుంచీ నేను ఉన్నానేంటి నా బొంగు అంటూ నోరుజారాడు సందీప్. దీనికి భోలే షవాలి సందీప్ అబ్యూజ్డ్ వర్డ్ వాడాడు అంటూ అబ్జక్షన్ చేశాడు. దీనికి సందీప్ తప్పుగా మాట్లాడద్దు అంటూ రెచ్చిపోయి భోలే పైకి వెళ్లాడు. దీనికి శివాజీ నువ్వు అరిస్తే మనం మాట్లాడింది అరిస్తే ఒప్పు అవ్వదు.

తప్పు ఒప్పవ్వదు, ఒప్పు తప్పు అవ్వదు అంటూ కౌన్సిలింగ్ చేశాడు. వెళ్లి నామినేట్ చేయమని చెప్పాడు. దీనికి మద్యలో లేచి ఎవరైతే పోట్రే చేస్తున్నారో అది జనాలందరూ చూస్తున్నారు అంటూ సందీప్ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అమర్ భోలే షవాలిని నామినేట్ చేస్తూ లాజిక్స్ మాట్లాడాడు. దీన్ని భోలే తిప్పికొట్టాడు. అలాగే అమర్ శివాజీని సైతం నామినేట్ చేశాడు. ఇప్పుడు ఈ నామినేషన్స్ పార్ట్ – 2 అనేది హైలెట్ గా మారింది. రెండురోజులు టెలికాస్ట్ లో ఈసారి అన్ని పాయింట్స్ ని కవర్ చేస్తున్నాడు బిగ్ బాస్.

ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ కి శివాజీ బ్యాచ్ కి వార్ స్టార్ట్ అయ్యింది. కొత్తగా రీ ఎంట్రీ గా వచ్చిన రతిక కూడా శివాజీ బ్యాచ్ వైపే తిరిగింది. అందుకే, శోభాని – అమర్ ఇద్దరినీ నామినేట్ చేసింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ గా ఉన్న సందీప్ కూడా ఈవారం నామినేషన్స్ లోకి వచ్చాడు. గత 7వారాలుగా సందీప్ నామినేషన్స్ నుంచీ తప్పించుకుంటూ వచ్చాడు. ఫైనల్ గా ఈవారం నామినేషన్స్ లోకి సందీప్ ఒకే ఒక్క ఓటుతో వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం 10మంది నామినేషన్స్ లో ఉన్నట్లుగా టాక్. మరీ వీళ్లలో ఎవరు సేఫ్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus