ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులకు పోటీ పడుతున్న సినిమాలు

సినీ స్టార్స్ గౌరవంగా భావించే అవార్డుల్లో ఫిలిం ఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. గత ఏడాది జూన్ 17 న ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సారి జూన్ 16న 65వ ఫిలిం ఫేర్ సౌత్ అవార్డుల వేడుకు మరింత గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సారి అవార్డుల కోసం గట్టి పోటీ ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150, బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి .. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. అలాగే అర్జున్ రెడ్డి వంటి యంగ్ హీరోల చిత్రాలు కూడా పోటీ పడుతున్నాయి. తెలుగు నుంచి ఫిలిం ఫేర్ అవార్డులకు పోటీపడుతున్న చిత్రాల జాబితా…

కేటగిరి: ఉత్తమ కథానాయకుడు
1) చిరంజీవి ( ఖైదీనెంబర్ 150)

2) బాలకృష్ణ ( గౌతమీపుత్ర శాతకర్ణి )
3) ప్రభాస్ ( బాహుబలి 2)
4) ఎన్టీఆర్ ( జై లవకుశ )
5) విజయ్ దేవరకొండ ( అర్జున్ రెడ్డి )

ఉత్తమ చిత్రం :
1) బాహుబలి 2
2) ఫిదా
3) శతమానం భవతి
4) అర్జున్ రెడ్డి
5) గౌతమీపుత్ర శాతకర్ణి

ఉత్తమ దర్శకుడు:
1) క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
2) ఎస్ ఎస్ రాజమౌళి (బాహుబలి 2)
3) సందీప్ రెడ్డి వంగా (అర్జున్ రెడ్డి)
4) శేఖర్ కమ్ముల (ఫిదా)

5) సంకల్ప్ రెడ్డి (ఘాజి)
6) సతీష్ వేగేశ్న (శతమానం భవతి)

ఉత్తమ కథానాయిక :
1) అనుష్క (బాహుబలి 2)
2) రితిక సింగ్ (గురు)
3) నివేదా థామస్ (నిన్ను కోరి)
4) సాయి పల్లవి (ఫిదా)
5) రకుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం)

వీటిలో ఎవరికీ అవార్డులు వరిస్తాయో కొన్ని రోజుల్లోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus