Bigg Boss 7 Telugu: 3వ వారం చప్పగా సాగిన నామినేషన్స్.. హౌస్ మేట్స్ ఏం చేశారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్స్ చాలా చప్పగా సాగాయి. అస్సలు మజా రాలేదు. హౌస్ మేట్స్ చాలా డిప్లమాటిక్ గా వాదన పెట్టుకోకుండా లాజిక్స్ మాట్లాడేందుకు చూశారు. అంతేకాదు, తిప్పి తప్పి అక్కడక్కడే తిరుగుతూ ఎవరికి వారు జెన్యూన్ అని అనిపించునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నామినేషన్స్ లో కొంతమంది గ్రూప్ గా శుభశ్రీ ఇంకా గౌతమ్ లని టార్గెట్ చేశారు. అలాగే థామినిని పల్లవి ప్రశాంత్ ఇంంకా ప్రిన్స్ లు నామినేట్ చేశారు. ఈవారం సేఫ్ గా శోభాశెట్టి ఇంకా పల్లవి ప్రశాంత్ లు తప్పించుకున్నారు.

అలాగే, శివాజీకి ఇంకా సందీప్ కి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వారిద్దరూ కూడా నామినేషన్స్ లోకి రాలేదు. అలాగే సందీప్ శివాజీ తమ పవర్ ని ఉపయోగించి టేస్టీ తేజని సేఫ్ చేశారు. నిజానికి నామినేషన్స్ అంటే సోమవారం హౌస్ వేడెక్కిపోతుంది. కానీ, ఈసారి నామినేషన్స్ చాలా చప్పగా సైలెంట్ గా సాగాయి. టేస్టీ తేజ పల్లవి ప్రశాంత్ ల మద్యలో కాసేపు ఫన్ నడిచినా అది అనుకున్నంత ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అలాగే, గౌతమ్ కి రతికకి వాగ్వివాదం కాసేపు అయ్యింది. కానీ, తిప్పి తప్పి వాళ్లు లాస్ట్ వీక్ ఆటలో బాహుబలి టీమ్ మెంబర్స్ గానే ఉండిపోయారు.

ఆ తర్వాత శోభాశెట్టి కూడ ఈవారం నామినేషన్స్ నుంచీ తప్పించుకుంది. కానీ, శోభాశెట్టికి ఇంకా శుభశ్రీకి ఇద్దరికీ గట్టిగా పడింది. నీ రీజన్ ని నేను యాక్సెప్ట్ చేయను అని శుభశ్రీ మంకుపట్టి పట్టి కూర్చుంది. దీంతో బిగ్ బాస్ శివాజీని నిర్ణయం తీస్కోమని ఆదేశించాడు. ఇక శివాజీ నామినేషన్స్ ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా రీజన్ ని యాక్పెప్ట్ చేయాల్సిందే అంటూ చెప్పాడు. దీంతో శుభశ్రీ ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చింది. అలాగే, ప్రియాంక ని కూడా ఈసారి నామినేట్ చేశారు.

ముఖ్యంగా ప్రిన్స్ కి ఇంకా ప్రియాంకకి ఈగో క్లాషెష్ వచ్చాయి. ఒక చిన్న మాటని పట్టుకుని అక్కడక్కడే ఇద్దరూ వాదించుకున్నారు. అలాగే శుిభశ్రీ కూడా ప్రియాంకని నామినేట్ చేసింది. నీ వల్లే నన్ను అందరూ ఇప్పుడు బ్యాక్ ఫైర్ చేస్తున్నారంటూ కారణం చెప్పింది. దీనికి చాలా డిస్సపాయింట్ అయ్యింది ప్రియాంక. ఈసారి నామినేషన్స్ లోకి 7గురు వచ్చారు. అందులో ప్రియాంక, శుభశ్రీ, అమర్ దీప్, గౌతమ్, రతిక, థామినీ , ప్రిన్స్ ఉన్నారు. మరి వీళ్లలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతురా అనేది ఆసక్తికరం.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus