విశాల్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ… మన తెలుగు ప్రాంతానికి చెందినవాడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళంలో నడిగర్ సంఘం అధ్యక్షుడయ్యాడు. కొంత కాలం బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం విశాల్ కు ఎక్కడ లేని సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు విశాల్ లీగల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. విశాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవ్వడం సంచలనంగా మారింది. అసలు విషయం ఏమిటంటే నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధించిన పన్నులు, టీడీఎస్… సరిగ్గా చెల్లించలేదని, అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. విశాల్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా చాలా సార్లు నోటీసులు పంపారట. కానీ విశాల్ స్పందించలేదంట. దీంతో ఐటీ అధికారులు చెన్నైలోని ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీని పై విచారణ జరిపిన ఎగ్మూర్ కోర్టు.. ఈసారి విశాల్ విచారణకు హాజరు కాని పక్షంలో అతని పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసు పై పునర్విచారణ ఆగష్టు 28కి వాయిదా వేశారు.