పొరపాటు కాదు అంటున్న రవి తేజ..!

మాస్ మహారాజా రవి తేజ…ఇండస్ట్రీ లో ఎన్నో కష్టాలు పడి, స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో రవి తేజ ఒకడు…పూరీ జగన్నాధ్ దర్శకుడిగా నిలదొక్కునే క్రమంలో రవి హీరోగా మారిపోయాడు…అయితే వరుస హిట్స్ తో కొంతకాలం దూసుకెళ్లిన రవి…ఆ తరువాత వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే రవి తేజ లాస్ట్ సినిమాకి ఇప్పటికీ దాదాపుగా రెండు ఏళ్లు గ్యాప్ రావడంతో రవి సినిమా కోసం ఆశగా ఎదురు చూసుటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక అసలీ విషయం ఏమిటి అంటే…నిన్న దసరా పండుగ సంధర్భంగా, మాస్ మహారాజా  రవితేజ  ప్రేక్షకులందరికీ ‘దీపావళి శుభాకాంక్షలు’  తెలపడం షాకింగ్ న్యూస్ గా మారింది. అదేంటి దసరాకి దీపావళి శుభాకాంక్షలు ఏంటి అంటే…ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పాడని తెలుస్తుంది…ఇంతకీ ఎలా అని అంటే…రవి తేజ చెబుతున్న మాటల ప్రకారం…తన సినిమా “రాజా ది గ్రేట్” సినిమా విడుదలయ్యేది దీపావళి కనుక తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించాడు.

ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో తన కొత్త చిత్రం “రాజా ది గ్రేట్” సినిమాను వెరైటీగా పబ్లిసిటీ చేయడానికి ఆ చిత్రంలో నటించిన హీరో రవితేజ  హీరోయిన్ మేహ్రీన్ మరియు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కమెడియన్ శ్రీనివాస్ లు కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను రూపొందించి విడుదల చేసారు. ఈ వీడియోలోనే రవితేజ ఇలా వినూత్నంగా ట్రై చేసి  అందరికీ షాక్ ఇచ్చాడు. ‘పటాస్’ ‘సుప్రీమ్’ వంటి రెండు కమర్షియల్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమాగా “రాజా ది గ్రేట్” ను ప్రేక్షకుల ముందుకు  తీసుకు రావడానికి చాలా గట్టిప్రయత్నాలు చేస్తున్న  విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా పై అంచనాలు చాలా బాగున్నాయి. మరి అదే ఊపులో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని రవితేజని మళ్లీ మాస్ మహారాజుగా నిలబెట్టాలి అని కోరుకుందాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus