క్లాసిక్ హిట్ గా నిలుస్తుంది అని అనుకున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” ఫెయిల్ అవ్వడంతోనే టీం మరియు ఫ్యాన్స్ అందరూ నీరుగారిపోయారు. ఇక నిన్న విడుదలైన “ఎన్టీఆర్ మహానాయకుడు” కూడా ఫ్లాప్ గా నిలవడమే కాక కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోవడంతో అందరూ కుదేలయ్యారు. ఒక పక్క చిత్రబృందం, మరో పక్క నందమూరి మరియు తెలుగుదేశం పార్టీ సభ్యులు సినిమా ఫ్లాప్ అయ్యిందని బాధపడుతుండగా.. మరోపక్క రాంగోపాల్ వర్మ మాత్రం పండగ చేసుకుంటున్నాడు. ఇదే అదునుగా భావించి తాను తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్”ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు.
చాలా కాంట్రవర్సియల్ కంటెంట్ తో తెరకెక్కిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” హిట్ అవుతుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. కనీస స్థాయి ఓపెనింగ్స్ వస్తాయి అనేది మాత్రం పచ్చి నిజం. ఓపెనింగ్స్ సరే.. పొరపాటున సినిమా హిట్ అయితే పరిస్థితి ఏమిటా అని అందరూ కంగారుపడుతున్నారు. అసలే ఆర్జీవీ ఈ తరహా బయోపిక్స్ తీయడంలో సిద్ధహస్తుడు.. సో ఆ సినిమా జనాలకి నచ్చితే బాలయ్య పరువు పోతుందా లేదా అనే విషయం పక్కన పెడితే పెద్దాయన ఎన్టీఆర్ ఇమేజ్ కి చాలా డ్యామేజ్ అవుతుంది.