‘బాహుబలి'( సిరీస్) క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంతో ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. తన తరువాతి చిత్రం ‘సాహో’ ని కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి భారీ వసూళ్లను రాబట్టాడు. ‘సాహో’ కి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ ఏకంగా 230 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాడు. మొదటి రోజు 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. బాలీవుడ్ స్టార్లకు కూడా సాధ్యం కానీ ఫీట్ అది. ఇక తరువాతి సినిమాని కూడా తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఇప్పుడు రాజమౌళి తో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్న చరణ్, ఎన్టీఆర్ లకు మాత్రం పాన్ ఇండియా పై ఇంట్రెస్ట్ లేనట్టే కనిపిస్తుందని ఇన్సైడ్ టాక్.
ఎన్టీఆర్.. నిన్ననే త్రివిక్రమ్ తో తన 30వ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసాడు. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించేసారు. ఇది పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రమని తెలుస్తుంది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించేసారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనే విడుదలవుతుందట. సో ఎన్టీఆర్ కు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత పాన్ ఇండియా చేసే ఆలోచన లేదని దీంతో తెలిసిపోయింది. ఇక చరణ్ కూడా అనిల్ రావిపూడి లేదా గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులతో సినిమాలు ఫైనల్ చేసే పనిలో పడ్డాడట. ఇందులో అనిల్ రావిపూడి సినిమానే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. పోనీ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసిన హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండచ్చు. ఎందుకంటే ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నాడు కాబట్టి..! సో చరణ్ కు కూడా పాన్ ఇండియా.. ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి. ఒకవేళ తెలుగులో వీరు చేస్తున్న సినిమాలు హిట్ అయితే హిందీలో డబ్బింగ్ ఇస్తారేమో.. చూడాలి.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!