NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు. దీని ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసి ‘కాంతార చాప్టర్ 1’ కు బెస్ట్ విషెస్ తెలిపారు.

NTR at Kantara Chapter 1 Pre Release Event

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నాకు గొంతు నొప్పిగా ఉంది..! కాబట్టి ఎప్పటిలా అరిచినట్లుగా మాట్లాడలేను.. దయచేసి అర్థం చేసుకోండి. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మమ్మ కుందాపూర్ అనేది మన ఊరు అని చెప్పేది. అలాగే ఆమె చిన్నప్పటి నుండి విన్న కథల్ని నా చిన్నప్పుడు చెప్పేది.అప్పుడు నాకు అర్ధమయ్యేది కాదు. ఇది ఏంటి? ఇది నిజంగా జరిగిందా.. లేక ఎప్పటికైనా జరుగుతుందా?

ఇలా చాలా డౌట్స్ ఉండేవి.కానీ ఆ కథలు నాకు బాగా నచ్చేవి.ఆవిడ చెప్పినప్పుడల్లా బాగా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారైనా వెళ్లి చూడాలి కదా. ఈ గుళిగ ఆట అనేది ఏంటి? ఈ పింజురీయిలా అంటే ఏంటి? ఒక్కసారి చూడాలి కదా.? అని నాకు చిన్నప్పటి నుండి నాటుకుపోయింది.కానీ ఏ రోజూ అనుకోలేదు. నేను చిన్నప్పుడు విన్న ఆ కథల గురించి.. ఓ దర్శకుడు ఒక సినిమా తీస్తాడు అని..! అందువల్ల ‘కాంతార’ చూసినప్పుడు నాకు మాటల్లేవ్.

ఆ కథ తెలిసి నేనే ఇలా అయిపోతే.. ఈ కథ కొత్తగా తెలుసుకున్నప్పుడు ఆడియన్స్ ఏమయ్యారు అనేదే ‘కాంతార’ సినిమా ఫలితం. ‘కాంతార’ తో నా కల నిజం చేశారు రిషబ్ శెట్టి. ఆయన ఒక రేర్ బ్రీడ్ డైరెక్టర్ & యాక్టర్.ఉడిపి కృష్ణుడు గుడికి మా అమ్మని తీసుకెళ్లాలని నా కోరిక..! అది రిషబ్ వల్లే సాధ్యపడింది. వాళ్ల పనులన్నీ మానుకుని మరీ మాతోనే వచ్చారు.. మాతోనే ఉన్నారు.నన్ను ఒక సొంత తమ్ముడిలా చూసుకున్నారు రిషబ్ శెట్టి అలాగే అతని భార్య ప్రగతి గారు.

అదే టైంలో ‘కాంతార చాప్టర్ 1’ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూశాను. ఒకసారి నన్ను ఒక గుడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళడానికి మార్గమే లేదు. కానీ సినిమా కోసం వాళ్ళు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఫొటోల్లో కనుక మీరు చూసి ఉంటే మోకాళ్ళ వరకు నీళ్లు ఉంటాయి. రిషబ్ శెట్టి కానుకండా ‘కాంతార చాప్టర్ 1’ ని పూర్తి చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఈ స్టేజిపై మా బ్రదర్ ప్రశాంత్ నీల్ లేకపోవడం లోటుగా అనిపిస్తుంది.

ఏదేమైనప్పటికీ ‘కాంతార చాప్టర్ 1’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus