Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూటింగ్ మొదలైంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల తరువాత బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 2017లో బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ఆ తరువాత బుల్లితెరపై కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆయన ఓ టీవీ షో ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా దర్శనమివ్వనున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో భారీగా వేసిన సెట్స్ లో షూటింగ్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని చెబుతున్నారు. జూలై 20 వరకు ఈ షూటింగ్ జరగనుంది. ఆ తరువాత మంచి రోజు చూసుకొని టెలికాస్ట్ చేస్తారు. హిందీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు వెర్షనే ఈ షో. ఇంతకముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మాటీవీ కొన్నాళ్లు ఆ షోని నడిపించింది. నాగార్జున కొంతకాలం, చిరు కొంతకాలం పాటు ఈ షోని హోస్ట్ చేశారు.

కానీ రేటింగ్స్ రావడం లేదని షోని ఆపేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ తీసుకొని కొత్త పద్దతిలో మొదలుపెడుతోంది. ఈ షో కోసం ఎన్టీఆర్ పది కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus